logo

ఊపందుకుంటున్న జాతీయ జెండాల విక్రయాలు

చెన్నై మహా నగరం, శివారు ప్రాంతాల్లోని తపాలా కార్యాలయాల్లో జాతీయ జెండాల విక్రయాలు ఊపందుకుంటున్నాయి. స్వాతంత్య్రం వచ్చి 75 వసంతాలు పూర్తి కావస్తున్న సందర్భంగా  ‘హర్‌ ఘర్‌ తిరంగా’ పేరిట  జాతీయ స్థాయిలో కార్యక్రమాలు జరగాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.

Published : 08 Aug 2022 00:29 IST

వడపళని, న్యూస్‌టుడే: చెన్నై మహా నగరం, శివారు ప్రాంతాల్లోని తపాలా కార్యాలయాల్లో జాతీయ జెండాల విక్రయాలు ఊపందుకుంటున్నాయి. స్వాతంత్య్రం వచ్చి 75 వసంతాలు పూర్తి కావస్తున్న సందర్భంగా  ‘హర్‌ ఘర్‌ తిరంగా’ పేరిట  జాతీయ స్థాయిలో కార్యక్రమాలు జరగాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఆ మేరకు తపాలా కార్యాలయాల్లో రూ.25కు జెండా విక్రయాలు ప్రారంభమయ్యాయి. ఆగస్టు ఒకటో తేదీ నుంచి  57 వేల జెండాలు విక్రయించామని తపాలా విభాగం పేర్కొంది. రాష్ట్రంలోని 2,191 తపాలా కార్యాలయాల్లో ఈ విక్రయాలు జరుగుతున్నాయి. ww.epostoffice.gov.in- వెబ్‌సైట్‌, తపాలా శాఖ కార్యాలయాల్లో గానీ అధిక సంఖ్యలో పొందవచ్చని చెన్నై సిటీ రీజియన్‌ పోస్ట్‌ మాస్టర్‌ జనరల్‌ జి.నటరాజన్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. అన్నారోడ్‌ ప్రధాన తపాలా కార్యాలయంలో సెల్ఫీ పాయింట్‌ను కూడా ఏర్పాటు చేశారు.  
75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ పతాకాల తయారీ, విక్రయాలు జోరందుకున్నాయి. చిత్రంలో పుదుక్కోట జిల్లా ముద్రణాలయాల్లో పతాకాలను తయారు చేస్తున్న కార్మికుడు - వేలచ్చేరి, న్యూస్‌టుడే

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని