logo

‘మెగా పట్టు’ ప్రదర్శన ప్రారంభం

చెన్నై ఎగ్మూర్‌ పాంథియన్‌ రోడ్డులోని కో-ఆప్‌టెక్స్‌ మైదానంలో చేనేత కార్మికులను గౌరవించేలా ఏర్పాటు చేసిన 8వ జాతీయ ప్రత్యేక మెగా పట్టు ప్రదర్శనను ఆదివారం చేనేత శాఖ మంత్రి ఆర్‌ గాంధీ ప్రారంభించారు.

Published : 08 Aug 2022 00:29 IST

ప్రదర్శలో వస్త్రాలను తిలకిస్తున్న మంత్రి ఆర్‌.గాంధీ

విల్లివాక్కం, న్యూస్‌టుడే: చెన్నై ఎగ్మూర్‌ పాంథియన్‌ రోడ్డులోని కో-ఆప్‌టెక్స్‌ మైదానంలో చేనేత కార్మికులను గౌరవించేలా ఏర్పాటు చేసిన 8వ జాతీయ ప్రత్యేక మెగా పట్టు ప్రదర్శనను ఆదివారం చేనేత శాఖ మంత్రి ఆర్‌ గాంధీ ప్రారంభించారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్‌ ఎం.మహేష్‌కుమార్‌, చేనేత, ఖాదీ శాఖ ముఖ్య కార్యదర్శి ధర్మేంద్ర ప్రతాప్‌ యాదవ్‌, చేనేత శాఖ కమిషనర్‌ రాజేష్‌, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.
చేనేత ఉత్పత్తులు సజీవ వారసత్వం
చెన్నై, న్యూస్‌టుడే: చేనేత ఉత్పత్తులు సజీవ వారసత్వమని గవర్నర్‌ రవి తెలిపారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆయన సందేశ ప్రకటన విడుదల చేశారు. అందులో... ప్రాచీన భారతీయ నాగరికతలో చేనేత ఎప్పుడూ ఓ భాగమని, ఆ ఉత్పత్తులు సజీవ వారసత్వమని తెలిపారు. సంస్కృతి, స్వాతంత్య్ర పోరాటంలోనూ ఇవి భాగమేనని పేర్కొన్నారు. ఈ సంస్కృతి చిహ్నాన్ని కాపాడి ప్రాచుర్యం కల్పిస్తున్నందుకు రాష్ట్రంలోని కార్మికులకు కృతజ్ఞతలు తెలిపారు.  

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని