logo

రాష్ట్రంలో డెంగీ తీవ్రత తక్కువే

ఈ ఏడాది రాష్ట్రంలో డెంగీ తీవ్రత తక్కువగానే ఉందని మంత్రి మా.సుబ్రమణియన్‌ తెలిపారు. చెన్నై తేనాంపేట 125 మండలంలో కార్పొరేషన్‌ కమ్యూనిటీ హాల్‌లో జరిగిన 33వ కొవిడ్‌ మెగా టీకా శిబిరాన్ని ఆదివారం ఆయన పరిశీలించారు

Updated : 08 Aug 2022 04:54 IST

టీకా శిబిరాన్ని పరిశీలిస్తున్న మంత్రి మా.సుబ్రమణియన్‌

 ఆర్కేనగర్‌, న్యూస్‌టుడే: ఈ ఏడాది రాష్ట్రంలో డెంగీ తీవ్రత తక్కువగానే ఉందని మంత్రి మా.సుబ్రమణియన్‌ తెలిపారు. చెన్నై తేనాంపేట 125 మండలంలో కార్పొరేషన్‌ కమ్యూనిటీ హాల్‌లో జరిగిన 33వ కొవిడ్‌ మెగా టీకా శిబిరాన్ని ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా లక్ష ప్రత్యేక కరోనా టీకా శిబిరాలు జరిగాయని చెప్పారు. వర్షాకాలంలో అంటువ్యాధుల నుంచి కాపాడేందుకు వైద్య శిబిరాలు నిర్వహించేందుకు ఆదేశించామని చెప్పారు. క్షయ, చర్మవ్యాధులు లేని రాష్ట్రమే లక్ష్యంగా చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. పిండాల వ్యవహారంలో నిర్వాహకులు స్టే తెచ్చుకున్నారని అన్నారు. ఈ విషయమై అప్పీల్‌ చేసి స్కాన్‌ సెంటర్లను మళ్లీ మూసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వ న్యాయమైన చర్యలకు వ్యతిరేకంగా ఆస్పత్రి సిబ్బంది పోరాటం చేస్తున్నారని చెప్పారు. వైద్యవిద్య చదివినవారు ప్రజల క్షేమానికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నారని తెలిపారు. పిండాలు విక్రయానికి సహకరించిన వైద్యులపై చర్యలు తీసుకోవాలని వైద్యుల కౌన్సెలింగ్‌కు లేఖ పంపామని చెప్పారు. 2021లో 6,039 మంది డెంగీ బారిపడ్డారని పేర్కొన్నారు. 2022 ఏడాదిలో ఇప్పటివరకు వరకు 3,172 మందికి మాత్రమే ఇది సోకిందన్నారు. రాష్ట్రంలో కుటుంబ ఆరోగ్య కార్డు అందజేస్తామన్నారు. కార్యక్రమంలో చెన్నై మేయర్‌ ప్రియ, డిప్యూటీ మేయర్‌ మహేష్‌కుమార్‌, ఎమ్మెల్యే వేల్‌ తదితరులు పాల్గొన్నారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని