logo

ప్రధానితో రంగస్వామి భేటీ

ప్రధానితో పుదుచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామి భేటీ అయ్యారు. రంగస్వామి బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీతో ఇప్పటివరకు సమావేశం కాలేదు. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి ఆయన దిల్లీ పర్యటనకు వెళ్లారు. మంగళవారం మధ్యాహ్నం మోదీని కలిశారు.

Published : 10 Aug 2022 00:38 IST

మోదీకి పుష్పగుచ్ఛం అందిస్తున్న పుదువై సీఎం

చెన్నై, న్యూస్‌టుడే: ప్రధానితో పుదుచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామి భేటీ అయ్యారు. రంగస్వామి బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీతో ఇప్పటివరకు సమావేశం కాలేదు. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి ఆయన దిల్లీ పర్యటనకు వెళ్లారు. మంగళవారం మధ్యాహ్నం మోదీని కలిశారు. బడ్జెట్‌కు అనుమతి, పుదువైకు అదనపు నిధులు, రుణాల మాఫీ తదితర అంశాలపై చర్చించినట్టు సమాచారం. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవియా తదితరులతోనూ భేటీ అయ్యారు. సీఎం వెంట ప్రత్యేక కార్యదర్శి అముదవన్‌ ఉన్నారు. బుధవారం పుదుచ్చేరి బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమవుతాయని సభాపతి సెల్వం ప్రకటించిన నేపథ్యంలో సీఎం దిల్లీ వెళ్లడం గమనార్హం. రూ.11 వేల కోట్ల బడ్జెట్‌కు పంపిన ప్రతిపాదనలకు అనుమతి లభించకపోవడంతో నేరుగా ముఖ్యమంత్రి రంగంలోకి దిగినట్టు తెలిసింది. ఈ పర్యటన ద్వారా పుదుచ్చేరిలో భాజపా, ఎన్నార్‌ కాంగ్రెస్‌ కూటమి వ్యవహారంలోనూ ఓ స్పష్టత రావచ్చని తెలుస్తోంది.

Read latest Tamilnadu News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts