logo

‘విద్యున్మండలి ప్రైవేటీకరణను వ్యతిరేకించాలి’

విద్యున్మండలి ప్రైవేటీకరణ ప్రయత్నాలను ముఖ్యమంత్రి స్టాలిన్‌ వ్యతిరేకించాలని టీఎన్‌సీసీ మాజీ అధ్యక్షుడు ఈవీకేఎస్‌ ఇళంగోవన్‌ కోరారు. చెన్నైలోని సత్యమూర్తి భవన్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తోందని ఆరోపించారు.

Updated : 10 Aug 2022 06:41 IST

నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలను నిరసిస్తూ దక్షిణ చెన్నై కాంగ్రెస్‌ విభాగం ఆధ్వర్యంలో

75 కిలోమీటర్ల దూరం సాగనున్న ర్యాలీ మంగళవారం టీఎన్‌సీసీ మాజీ అధ్యక్షుడు తంగబాలు

ఆధ్వర్యంలో శాంథోం చర్చి ప్రాంతంలో ప్రారంభమైంది.    -చెన్నై, న్యూస్‌టుడే

చెన్నై, న్యూస్‌టుడే: విద్యున్మండలి ప్రైవేటీకరణ ప్రయత్నాలను ముఖ్యమంత్రి స్టాలిన్‌ వ్యతిరేకించాలని టీఎన్‌సీసీ మాజీ అధ్యక్షుడు ఈవీకేఎస్‌ ఇళంగోవన్‌ కోరారు. చెన్నైలోని సత్యమూర్తి భవన్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తోందని ఆరోపించారు. అందులో భాగంగా విద్యుత్తు చట్ట సవరణల ద్వారా విద్యున్మండలిని ప్రైవేటుకు విక్రయించడానికి ప్రయత్నిస్తోందని తెలిపారు. ముఖ్యమంత్రి స్టాలిన్‌ దీన్ని వ్యతిరేకించాలని కోరారు. 5జీ స్పెక్ట్రం కేటాయించడంలో భారీ అవినీతి చోటుచేసుకుందని ఆరోపించారు.  దేశప్రజలు, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు గళం విప్పుతూనే ఉంటామని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని