logo

విజేతలకు రూ.కోటి నజరానా

చెస్‌ ఒలింపియాడ్‌ క్రీడల్లో భారత్‌ తరఫున పతకాలు సాధించిన జట్టులకు రూ.కోటి చొప్పున ముఖ్యమంత్రి స్టాలిన్‌ బుధవారం నజరానా అందించారు. మామల్లపురంలో జరిగిన 44వ అంతర్జాతీయ చెస్‌ ఒలింపియాడ్‌ పోటీల్లో జనరల్‌ విభాగంలో భారత్‌ ‘బి’, మహిళల విభాగంలో భారత్‌ ‘ఏ’ విభాగాలు పతకాలు సాధించాయి. వీరికి రూ.కోటి చొప్పున ముఖ్యమంత్రి

Published : 11 Aug 2022 01:17 IST

ముఖ్యమంత్రి తదితరులతో నజరానా పొందిన ఆటగాళ్లు

చెన్నై, న్యూస్‌టుడే: చెస్‌ ఒలింపియాడ్‌ క్రీడల్లో భారత్‌ తరఫున పతకాలు సాధించిన జట్టులకు రూ.కోటి చొప్పున ముఖ్యమంత్రి స్టాలిన్‌ బుధవారం నజరానా అందించారు. మామల్లపురంలో జరిగిన 44వ అంతర్జాతీయ చెస్‌ ఒలింపియాడ్‌ పోటీల్లో జనరల్‌ విభాగంలో భారత్‌ ‘బి’, మహిళల విభాగంలో భారత్‌ ‘ఏ’ విభాగాలు పతకాలు సాధించాయి. వీరికి రూ.కోటి చొప్పున ముఖ్యమంత్రి నజరానా ప్రకటించారు. కలైవాణర్‌ ఆడిటోరియంలో నజరానా మొత్తానికి సంబంధించిన బ్యాంకు చెక్కులను ముఖ్యమంత్రి స్టాలిన్‌ అందించారు. కార్యక్రమంలో మంత్రి మెయ్యనాథన్‌, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఇరైయన్బు, యువజన క్రీడా సంక్షేమం, క్రీడాభివృద్ధిశాఖ కార్యదర్శి అపూర్వ, 44వ అంతర్జాతీయ చెస్‌ ఒలింపియాడ్‌ క్రీడల ప్రత్యేక అధికారి దారేస్‌ అహమదు, తమిళనాడు క్రీడాభివృద్ధి ప్రాధికార సంస్థ సీఈవో, మెంబర్‌ సెక్రటరీ కార్తికేయన్‌ ఉన్నారు.

Read latest Tamilnadu News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts