logo

ఆలయ నిర్వాహకులకు బాండ్ల అందజేత

తిరువళ్లూరు జిల్లా పెరియపాళెయంలోని భవాని అమ్మవారి ఆలయ నిర్వాహకులకు బంగారం పెట్టుబడి బాండ్‌ను ముఖ్యమంత్రి స్టాలిన్‌ అందించారు. ఈ ఆలయానికి భక్తులు కానుకగా సమర్పించిన బంగారంలో అవసరమైనవి పోగా మిగతాదానిని కరిగించి కడ్డీలుగా మార్చారు.

Published : 12 Aug 2022 00:32 IST

బంగారం పెట్టుబడి బాండు అందిస్తున్న స్టాలిన్‌

చెన్నై, న్యూస్‌టుడే: తిరువళ్లూరు జిల్లా పెరియపాళెయంలోని భవాని అమ్మవారి ఆలయ నిర్వాహకులకు బంగారం పెట్టుబడి బాండ్‌ను ముఖ్యమంత్రి స్టాలిన్‌ అందించారు. ఈ ఆలయానికి భక్తులు కానుకగా సమర్పించిన బంగారంలో అవసరమైనవి పోగా మిగతాదానిని కరిగించి కడ్డీలుగా మార్చారు. మొత్తం 91.61 కిలోల కడ్డీలను స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో గోల్డ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ స్కీమ్‌లో డిపాజిట్‌ చేశారు. వాటి విలువ రూ.46.31 కోట్లు కాగా.. ఏటా రూ.1.04 కోట్ల వడ్డీ లభించనుంది. దానిని ఆలయ అభివృద్ధి పనులకు ఉపయోగించనున్నారు. దీనికి సంబంధించిన బాండ్‌ను ఆలయ నిర్వాహకులకు సచివాలయంలో గురువారం ముఖ్యమంత్రి స్టాలిన్‌ అందించారు. కార్యక్రమంలో మంత్రి శేఖర్‌బాబు, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఇరైయన్బు, సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ దురైస్వామిరాజు, పర్యాటక, దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్‌ చంద్రమోహన్‌, దేవాదాయ కమిషనరు కుమరగురు భరన్‌, అదనపు కమిషనరు కర్ణన్‌, ఆలయ పారంపర్య ట్రస్టీ అంజన్‌ లోకమిత్ర, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా జోనల్‌ మేనేజరు రాజలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని