logo

శాస్త్రోక్తంగా నూతన యజ్ఞోపవీత ధారణ

ఆర్య వైశ్య అఫీషియల్స్‌ అండ్‌ ప్రొఫెషనల్స్‌ అసోసియేషన్‌ (అవోపా) తమిళనాడు శాఖ, వాసవి క్లబ్‌ 2 స్టార్‌ ఎలైట్‌ చెన్నై సంయుక్త నిర్వహణలో శ్రావణ పౌర్ణమి సందర్భంగా గురువారం ఏర్పాటైన సామూహిక నూతన యజ్ఞోపవీత ధారణ శాస్త్రోక్తంగా జరిగింది.

Published : 12 Aug 2022 00:32 IST

రాజశేఖర్‌ను సత్కరిస్తున్న నిర్వాహకులు

చెన్నై(సాంస్కృతికం), న్యూస్‌టుడే: ఆర్య వైశ్య అఫీషియల్స్‌ అండ్‌ ప్రొఫెషనల్స్‌ అసోసియేషన్‌ (అవోపా) తమిళనాడు శాఖ, వాసవి క్లబ్‌ 2 స్టార్‌ ఎలైట్‌ చెన్నై సంయుక్త నిర్వహణలో శ్రావణ పౌర్ణమి సందర్భంగా గురువారం ఏర్పాటైన సామూహిక నూతన యజ్ఞోపవీత ధారణ శాస్త్రోక్తంగా జరిగింది. శ్రీకన్యకా పరమేశ్వరి దేవస్థానం దీనికి వేదికైంది. దాదాపు 200 మంది గృహస్థులు దేవాలయ మహా మండపంలో కూర్చుని నూతన యజ్ఞోపవీత ధారణ నిర్వహించారు. ముందుగా ఆలయ ప్రధాన అర్చకులు భాస్కర పంతులు పర్యవేక్షణలో హోమాలను జరిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జయరాజ్‌ ఇంటర్నేషనల్‌ మేనేజింగ్‌ డైరెక్టరు తాడేపల్లి రాజశేఖర్‌ విచ్చేశారు. ముఖ్య అతిథిని అధ్యక్షులు టీజీ శ్రీనివాసన్‌ (అవోపా), బీఎస్‌ శ్రీధర్‌ (వాసవీక్లబ్‌) సత్కరించారు. ఈ సందర్భంగా శ్రీకన్యకా పరమేశ్వరి మూలవిరాట్టును స్వర్ణాభరణాలతో, పలు రకాల పుష్పాలతో నేత్రపర్వంగా అలంకరించి దర్శనభాగ్యం కల్పించారు. కార్యదర్శి సి.రంగనాథం శెట్టి, కోశాధికారి పి.రాధాకృష్ణ ఏర్పాట్లను పర్యవేక్షించారు. వేలూర్‌, న్యూస్‌టుడే: తమిళనాడు విశ్వకర్మ స్నేహితుల సంక్షేమ సంఘం తరఫున వేలూర్‌ వీర బ్రహ్మంగారి మఠంలో 21 వ వార్షిక అవణి ఆవట్టం కార్యక్రమాన్ని గురువారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. సంఘం సభ్యులు శ్రావణ పౌర్ణమి సందర్భంగా యజ్ఞోపవీతాలను మార్చుకున్నారు. సంఘ అధ్యక్షుడు సీ.తేజోమూర్తి నేతృత్వంలో నిర్వహించిన కార్యక్రమంలో గణపతి హోమం నిర్వహించి గాయత్రీ మంత్రం జపిస్తూ యజ్ఞోపవీతాలను మార్చుకొన్నారు. కార్యక్రమంలో సంఘ కార్యదర్శి జనార్థనన్‌, కోఆర్డినేటరు నటేశన్‌, డిప్యూటీ ప్రెసిడెంటు పన్నీరుసెల్వం, ఆర్గనైజింగు సెక్రటరీ వీ.కుప్పుస్వామి తదితరులు పాల్గొన్నారు.

మైలాపూరులోని కంచి మఠంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న గృహస్థులు -చెన్నై, న్యూస్‌టుడే

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని