logo
Published : 12 Aug 2022 00:32 IST

‘స్మార్ట్‌ సిటీ పథకంలో అక్రమాలు’

బోరు పంపుతో కలిపి నిర్మించిన కాలువ

వేలచ్చేరి, న్యూస్‌టుడే: వేలూర్‌ నగర పాలక సంస్థలో చేపడుతున్న స్మార్ట్‌ సిటీ పనుల్లో అనేక అక్రమాలు చోటు చేసుకుంటుంటున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. అన్నాడీఎంకే హయాంలో ఈ పథకాన్ని ప్రారంభించారు. అప్పటి నేతలు అనుభవం లేని గుత్తేదార్లకు పనులు అప్పగించినట్లు అప్పట్లో పలు ఆరోపణలు వచ్చాయి. నగర పాలికలో ఇటీవలి కాలంలో ఇంటి ముందుంచిన ద్విచక్ర వాహనంతో కలిపి సిమెంటు రోడ్డును నిర్మించారు. అదేవిధంగా మరమ్మతుకు గురైన ప్రభుత్వ వాహనాన్ని అలాగే ఉంచి తారురోడ్డు వేశారు. ఇందుకుగాను అధికారులు గుత్తేరదారుల కాంట్రాక్టులను రద్దు చేశారు. ఇదిలా ఉండగా 2వ జోన్‌ సత్తువాచ్చారి వీరరాఘవపురం 19వ వార్డులో రోడ్డు పక్కన ప్లాట్‌ఫారంతో కలిపి కాలువను నిర్మిస్తున్నారు. కొన్నేళ్లుగా అక్కడ ఉన్న నీటిపంపుతో కలిపి కాలువ నిర్మాణం చేపట్టారు. విషయం తెలుసుకున్న కమిషననరు అశోక్‌ కుమార్‌ దానిని సరి చేయాలని అధికారులను ఆదేశించారు. దీనిపై నగర మేయర్‌ సుజాత విలేకర్లతో మాట్లాడుతూ..ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా గుత్తేదార్లతో సమావేశాన్ని నిర్వహించి సూచనలిచ్చామని తెలిపారు. నీటిపంపుతో కలిసి కాలువ నిర్మించిన అన్నాడీఎంకేకు చెందిన కుట్టి అనే గుత్తేదారు కాంట్రాక్టును రద్దు చేసినట్లు పేర్కొన్నారు.

Read latest Tamilnadu News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని