logo

‘ప్రతి ఇంటిపై జెండా ఎగరాలి’

స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని అరక్కోణం మన్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ లక్ష్మి తెలిపారు. సీఐఎస్‌ఎఫ్‌ తరఫున జాతీయ జెండాలను తక్కోళం పంచాయతీకి అందచేసే కార్యక్రమం గురువారం జరిగింది.

Published : 12 Aug 2022 00:32 IST

ర్యాలీ చేస్తున్న జవాన్లు

అరక్కోణం, న్యూస్‌టుడే: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని అరక్కోణం మన్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ లక్ష్మి తెలిపారు. సీఐఎస్‌ఎఫ్‌ తరఫున జాతీయ జెండాలను తక్కోళం పంచాయతీకి అందచేసే కార్యక్రమం గురువారం జరిగింది. తక్కోళం ప్రభుత్వ బాలికల మహోన్నత పాఠశాల ఆవరణలో సీఐఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో కమాండర్‌ గౌరవ్‌ తోమర్‌ నేతృత్వంలో ఏర్పాటైన ఈ కార్యక్రమంలో 500 మందికిపైగా జవాన్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ర్యాలీని చేపట్టారు. మున్సిపల్‌ కార్యాలయ ఆవరణలో కౌన్సిలర్లకు జాతీయ జెండాలను అందచేసే కార్యక్రమం జరిగింది. కమిషనర్‌ లత నేతృత్వంలో ఏర్పాటైన కార్యక్రమంలో ఛైర్‌పర్సన్‌ లక్ష్మి, ఉపాధ్యక్షురాలు కళావతి, కౌన్సిలర్లు, పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని