logo

నటుడు సూర్యపై కేసు కొట్టివేత

జై భీమ్‌ సినిమాలో వన్నియర్లను కించపరిచే విధంగా దృశ్యాలను విడుదల చేశారని నిర్మాత అయిన నటుడు సూర్య, దర్శకుడు జ్ఞానవేల్‌పై నమోదైన కేసును కొట్టివేస్తూ మద్రాసు హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.

Published : 12 Aug 2022 00:32 IST

ప్యారిస్‌, న్యూస్‌టుడే: జై భీమ్‌ సినిమాలో వన్నియర్లను కించపరిచే విధంగా దృశ్యాలను విడుదల చేశారని నిర్మాత అయిన నటుడు సూర్య, దర్శకుడు జ్ఞానవేల్‌పై నమోదైన కేసును కొట్టివేస్తూ మద్రాసు హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. వన్నియర్‌ సేనా సంస్థ అధ్యక్షుడు సంతోష్‌ సైదాపేట కోర్టులో తొలుత వ్యాజ్యం దాఖలు చేశారు. కోర్టు ఉత్తర్వులతో వేళచ్చేరి పోలీసులు కేసు నమోదు చేశారు. దీన్ని రద్దు చేయాలని, దర్యాప్తుపై నిషేధం విధించాలని సూర్య తదితరులు హైకోర్టును ఆశ్రయించారు. ఫిర్యాదు చేయడానికి ముందే సినిమాలో చర్చనీయాంశమైన దృశ్యాన్ని తొలగించారని, వన్నియర్‌లను కించపరిచేలా దృశ్యాలు ఉన్నాయని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవని తెలిపారు. గురువారం విచారించిన జస్టిస్‌ సతీష్‌కుమార్‌... సైదాపేట కోర్టు ఉత్తర్వులను కొట్టివేేస్తూ ఆదేశించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు