logo

త్వరలో అందుబాటులోకి రాకెట్ లాంచ్‌ ప్యాడ్‌

కులశేఖరపట్టిలో రాకెట్‌ లాంచ్‌ ప్యాడ్‌ నిర్మాణ పనులు త్వరలో ప్రారంభమవుతాయని, వీలైనంత త్వరగా అందుబాటులోకి వస్తుందని ఇస్రో ఛైర్మన్‌ సోమనాథ్‌ తెలిపారు. తూత్తుకుడి జిల్లా కులశేఖరపట్టిలో రాకెట్‌ లాంచ్‌ ప్యాడ్‌ నిర్మించనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో నిర్మాణ పనులు

Published : 13 Aug 2022 05:45 IST

ఇస్రో ఛైర్మన్‌

స్థలాన్ని పరిశీలిస్తున్న సోమనాథన్‌ తదితరులు

ఆర్కేనగర్‌, న్యూస్‌టుడే: కులశేఖరపట్టిలో రాకెట్‌ లాంచ్‌ ప్యాడ్‌ నిర్మాణ పనులు త్వరలో ప్రారంభమవుతాయని, వీలైనంత త్వరగా అందుబాటులోకి వస్తుందని ఇస్రో ఛైర్మన్‌ సోమనాథ్‌ తెలిపారు. తూత్తుకుడి జిల్లా కులశేఖరపట్టిలో రాకెట్‌ లాంచ్‌ ప్యాడ్‌ నిర్మించనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో నిర్మాణ పనులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇస్రో ఛైర్మన్‌ సోమనాథ్‌ ఆ ప్రాంతంలో శుక్రవారం పరిశీలించారు. పనులకు సంబంధించి అధికారులతో చర్చించారు. షార్‌ అధికారులు, తూత్తుకుడి కలెక్టర్‌ సెంథిల్‌రాజ్‌, రెవెన్యూ అధికారులు ఆయన వెంట ఉన్నారు. ఈ సందర్భంగా సోమనాథ్‌ విలేకరులతో మాట్లాడుతూ... దక్షిణ సరిహద్దు ప్రాంతంలో లాంచ్‌ ప్యాడ్‌ ఏర్పాటు చేయడానికి సరైన స్థలం లభించిందన్నారు. కేంద్ర మంత్రిత్వశాఖ అనుమతి కోసం వేచిచూస్తున్నామని చెప్పారు.

Read latest Tamilnadu News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts