logo

అధిక ఛార్జీలు వసూలు చేస్తే చర్యలు

వరుస సెలవుల సందర్భంగా అధిక ఛార్జీలు వసూలు చేసే ఆమ్నీ బస్సు యజమానులపై చర్యలు తీసుకుంటామని రవాణాశాఖ మంత్రి శివశంకర్‌ హెచ్చరించారు.

Published : 13 Aug 2022 05:45 IST

రవాణాశాఖ మంత్రి శివశంకర్‌

ప్యారిస్‌, వడపళని, న్యూస్‌టుడే: వరుస సెలవుల సందర్భంగా అధిక ఛార్జీలు వసూలు చేసే ఆమ్నీ బస్సు యజమానులపై చర్యలు తీసుకుంటామని రవాణాశాఖ మంత్రి శివశంకర్‌ హెచ్చరించారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవం సోమవారం జరుపుకోనున్నారు. అదేవిధంగా శని, ఆదివారాలు సెలవు కావడంతో చెన్నై నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు బస్సులు, రైళ్లలో పెద్దఎత్తున వెళ్తున్నారు.  చెన్నై నుంచి తిరుచ్చికి వెళ్లేందుకు ప్రైవేటు బస్సుల్లో రూ. 800 వసూలు చేస్తున్న స్థితిలో ప్రస్తుతం రూ.2,300, కోయంబత్తూరుకి రూ.3000, మదురైకి రూ.3,500 వరకు తీసుకుంటున్నట్లుగా ఫిర్యాదులు అందాయి. దీనిపై ప్రాంతీయ రవాణా కార్యాలయంలో ప్రజలు ఫిర్యాదు చేయవచ్చని, రవాణాశాఖ అధికారులు తనిఖీలు చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి శివశంకర్‌ ఆదేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని