logo

200 ఎకరాల్లో మూలికల సాగు

దిండుక్కల్‌లో 200 ఎకరాల్లో మూలికలు సాగు చేయనున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి మా.సుబ్రమణియన్‌ తెలిపారు. తాంబరం జాతీయ సిద్ధ వైద్య సంస్థలో కేంద్ర సిద్ధ వైద్య పరిశోధన

Published : 14 Aug 2022 00:16 IST

మంత్రి మా.సుబ్రమణియన్‌

రిబ్బన్‌ కత్తిరిస్తున్న కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్‌

ఆర్కేనగర్‌, న్యూస్‌టుడే: దిండుక్కల్‌లో 200 ఎకరాల్లో మూలికలు సాగు చేయనున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి మా.సుబ్రమణియన్‌ తెలిపారు. తాంబరం జాతీయ సిద్ధ వైద్య సంస్థలో కేంద్ర సిద్ధ వైద్య పరిశోధన గ్రూప్‌ ప్రధాన కార్యాలయం, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆప్‌ సిద్ధ మెడిసిన్‌, అయోధ్య పండిట్‌ హాస్పిటల్‌ కొత్త అవుట్‌ పెషెంట్‌ డిపార్ట్‌మెంట్‌ భవనాన్ని కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్‌ శనివారం అందుబాటులోకి తీసుకొచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి మా.సుబ్రమణియన్‌ పాల్గొని మాట్లాడుతూ.. కొత్త బ్లాక్‌లో 32 అవుట్‌ పేషెంట్‌ చికిత్సా సదుపాయాలు, 20 మందులు ఇచ్చే కౌంటర్లు, 30 మానసిక కౌన్సిలింగ్‌ గదులు ఉన్నాయని చెప్పారు. యోగాకు 500 సీట్లతో కూడిన బహుళ ప్రయోజన గది అదనంగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఏడాదిలో 365 రోజులు ఈ ఆస్పత్రి పనిచేస్తుందన్నారు. ఇక్కడి అవుట్‌ పెషెంట్ల బ్లాక్‌ ద్వారా రోజుకు 2500 మంది రోగులు చికిత్స పొందే వీలుందన్నారు. మూలికల పంట సాగులో రైతులను ప్రోత్సహించేందుకు వర్క్‌షాప్‌లు నిర్వహించనున్నట్లు తెలిపారు. విద్యార్థులకు మూలికలు, మూలికా పంటల సాగు గురించి అవగాహన కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ఒకే చోట నడుస్తున్న ఏడు సిద్ధ ఆయుష్‌ సంక్షేమ కేంద్రాలు, ఒక జాతీయ గ్రామీణ సంక్షేమ పథకం సిద్ధ యూనిట్‌ని ఎనిమిది చోట్లకు మార్చేందుకు ఏర్పాటు చేస్తామన్నారు. టామ్‌కాల్‌ కంపెనీ ద్వారా సౌందర్య ఉత్పత్తులను తయారుచేయనున్నట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని