logo

‘స్మార్ట్‌ సిటీ పనులు త్వరగా ముగిస్తాం’

‘స్మార్ట్‌ సిటీ’ పనులు త్వరగా పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి కేఎన్‌ నెహ్రూ పేర్కొన్నారు. ఈరోడ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో అభివృద్ధి పథకాల అమలుపై శనివారం మంత్రి నేతృత్వంలో పట్టణ స్థానిక సంస్థల

Published : 14 Aug 2022 00:16 IST

సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి కేఎన్‌ నెహ్రూ

విల్లివాక్కం, న్యూస్‌టుడే: ‘స్మార్ట్‌ సిటీ’ పనులు త్వరగా పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి కేఎన్‌ నెహ్రూ పేర్కొన్నారు. ఈరోడ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో అభివృద్ధి పథకాల అమలుపై శనివారం మంత్రి నేతృత్వంలో పట్టణ స్థానిక సంస్థల అధికారులతో సమావేశం జరిగింది. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ‘స్మార్ట్‌ సిటీ’ పథక పనులు పరిశీలించేందుకు విశ్రాంత ఐఏఎస్‌ అధికారి దేవిదార్‌ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కమిటీ విచారణ చేపడుతోందని, స్థానిక సంస్థల్లో చోటుచేసుకున్న అవినీతిపై నివేదిక అందిన వెంటనే తగిన చర్యలు తీసుకోనున్నట్టు మంత్రి నెహ్రూ పేర్కొన్నారు. హొగినేకల్‌ ఉమ్మడి తాగునీటి పథక పనులకు గాను నివేదిక అందిన వెంటనే పనులు ప్రారంభిస్తామని చెప్పారు. పట్టణ స్థానిక సంస్థల అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రూ.1,000 కోట్లు కేటాయించారని హర్షం వ్యక్తం చేశారు. ఈరోడ్‌లో ఊరాట్చిక్కోట్టై తాగునీటి పథకానికి పైపులు అమర్చడంలో జరిగిన సమస్యలను సరిచేస్తామన్నారు. కరోనా సమయంలో నగరపాలక సంస్థ దుకాణాలకు అద్దె చెల్లింపులో మినహాయింపు లేదని స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని