logo

అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

స్వాతంత్య్ర దిన 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని చెన్నై మెట్రో రైలు సంస్థ, తమిళనాడు గ్రామీణ కళల అభివృద్ధి సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు చెన్నై విమ్‌కోనగర్‌ మెట్రో రైల్వేస్టేషన్‌లో

Published : 15 Aug 2022 01:05 IST

ప్రదర్శనలు ఇస్తున్న గ్రామీణ కళాకారులు

సైదాపేట, న్యూస్‌టుడే: స్వాతంత్య్ర దిన 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని చెన్నై మెట్రో రైలు సంస్థ, తమిళనాడు గ్రామీణ కళల అభివృద్ధి సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు చెన్నై విమ్‌కోనగర్‌ మెట్రో రైల్వేస్టేషన్‌లో జరిగాయి. మదురై కళైమామణి సోమసుందరం బృందానికి చెందిన 20 మంది జానపద కళాకారులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో కరకాట్టం, కావడి ఆట్టం, మయిలాట్టం, కాలైయాట్టం, సిలంబాట్టం, ఒయిలాట్టం వంటి కళలకు సంబంధించిన కార్యక్రమాలను ప్రదర్శించారు. ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ముగింపు వేడుకలు సోమవారం సాయంత్రం చెన్నై అశోక్‌నగర్‌ మెట్రో స్టేషన్‌లో నిర్వహించనున్నట్లు ప్రతినిధులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని