logo

రామేశ్వరంలో గస్తీ ముమ్మరం

భారత్‌ -శ్రీలంక అంతర్జాతీయ సముద్రపు హద్దుకు అతి సమీపంలో రామేశ్వరం ఉన్నందున విదేశీ చొరబాట్లు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, శ్రీలంక శరణార్థుల రాకను పర్యవేక్షించడానికి భారత నేవీ, కోస్ట్‌ గార్డు అధికారులు గస్తీ ముమ్మరంగా నిర్వహిస్తున్నారు.

Published : 18 Aug 2022 00:44 IST

సముద్రంలో భారత నౌకాదళం గస్తీ తిరుగుతున్న దృశ్యం

వేలచ్చేరి, న్యూస్‌టుడే: భారత్‌ -శ్రీలంక అంతర్జాతీయ సముద్రపు హద్దుకు అతి సమీపంలో రామేశ్వరం ఉన్నందున విదేశీ చొరబాట్లు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, శ్రీలంక శరణార్థుల రాకను పర్యవేక్షించడానికి భారత నేవీ, కోస్ట్‌ గార్డు అధికారులు గస్తీ ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. చైనాకు చెందిన గూఢచారి నౌక శ్రీలంకకు చేరుకోవడంతో బుధవారం ఉదయం నుంచి రామేశ్వరం అగ్నితీర్థ తీరం, షిప్పింగు హార్బరు, ధనుష్కోటి, అరిచ్చల్‌ పాయింట్‌, పాంబన్‌, మండపం మొదలైన ప్రాంతాల్లో ఉచ్చిపులి ఐఎన్‌ఎస్‌ హాక్‌ హెలికాప్టర్‌ నుంచి నౌకాదళ సిబ్బంది తాడు సహాయంతో సముద్రంలోకి దిగి పరిశీలించారు. రామేశ్వరం బీచ్‌లో హెలికాప్టర్‌లో గస్తీ తిరగడం గురించి కోస్ట్‌ గార్డు అధికారులు విలేకర్లతో మాట్లాడుతూ, భారత దేశపు అభ్యంతరాలను పట్టించుకోకుండా చైనా గూఢచారి నౌకకు శ్రీలంక అనుమతివ్వడంతో ఇక్కడకు చేరిందని తెలిపారు. ఇది రామేశ్వరానికి అతి సమీపంలో ఉన్నందున భద్రతను కట్టుదిట్టం చేశామని చెప్పారు. ఈ నౌక శ్రీలంక నుంచి బయలుదేరే వరకు రామేశ్వరం సముద్ర ప్రాంతంలో 24 గంటలూ దృష్టి పెట్టాలని నిఘా సంస్థ ఆదేశించిందని తెలిపారు. ఈ సందర్భంగా భారత నావికా దళం, కోస్ట్‌ గార్డు, ఐఎన్‌ఎస్‌ ఫాల్కాన్‌కు చెందిన హెలికాప్టర్ల ద్వారా భద్రతా కసరత్తు నిర్వహిస్తున్నామని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు