logo

నాపైనా చెప్పులు విసిరారు: పొన్‌ రాధాకృష్ణన్‌

తాను కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు సేలంలో తనపై కూడా చెప్పులు విసిరారని భాజపా నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి పొన్‌ రాధాకృష్ణన్‌ తెలిపారు. రామనాథపురంలో బుధవారం జరిగిన భాజపా జిల్లా నిర్వాహకుల

Published : 18 Aug 2022 00:44 IST

విలేకర్లతో మాట్లాడుతున్న పొన్‌ రాధాకృష్ణన్‌

వేలచ్చేరి, న్యూస్‌టుడే: తాను కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు సేలంలో తనపై కూడా చెప్పులు విసిరారని భాజపా నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి పొన్‌ రాధాకృష్ణన్‌ తెలిపారు. రామనాథపురంలో బుధవారం జరిగిన భాజపా జిల్లా నిర్వాహకుల సమావేశంలో పాల్గొనడానికి వచ్చిన ఆయన విలేకర్లతో మాట్లాడుతూ... సుప్రీంకోర్టు, హైకోర్టుల తీర్పులకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అన్నాడీఎంకేకు కోర్టు ఇచ్చిన తీర్పు తరువాత ఆ పార్టీ నేతలే ఆలోచించి ఒక నిర్ణయానికి రావాలన్నారు. పురట్చి తలైవర్‌ ఎంజీఆర్‌ ప్రారంభించిన అన్నాడీఎంకే ఎప్పుడూ అలాగే ఉంటుందన్నారు. మరో పార్టికి ఆలోచన చేప్పే అంతటి వాడిని కాదన్నారు. ప్రజల కోసం అందరితో మంచిగా ఉండటానికి భాజపా సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. మంత్రిపై చెప్పులు విసిరారని పోలీసులు నిందితులను అరెస్టు చేస్తున్నారని గుర్తుచేశారు. ఇదే తరహాలో అన్ని విషయాల్లో చర్యలు తీసుకోవడానికి వారు సిద్ధమా అని ప్రశ్నించారు. తాను కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు 2017లో తనపై కూడా సేలంలో చెప్పులు విసిరారని గుర్తు చేశారు. అప్పుడు ఈ ఘటనను అనేక మంది ఖండించారని తెలిపారు. మంత్రులపై కొందరు చెప్పులు విసరడం కొత్తేమీ కాదన్నారు.

Read latest Tamilnadu News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts