logo

2,500 పాఠశాలల్లో చెట్ల కిందే చదువులు: మంత్రి

రాష్ట్రంలో 2,500 పాఠశాలల్లో చెట్ల కిందనే విద్యార్థులు విద్యనభ్యసించే పరిస్థితిలో ఉన్నాయని మంత్రి అన్బిల్‌ మహేష్‌ పొయ్యామొళి తెలిపారు. తిరుచ్చి జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో తిరుచ్చి, కరూర్‌, అరియలూర్‌,

Published : 18 Aug 2022 00:44 IST

విలేకరులతో మాట్లాడుతున్న మంత్రి అన్బిల్‌ మహేష్‌

ఆర్కేనగర్‌, న్యూస్‌టుడే: రాష్ట్రంలో 2,500 పాఠశాలల్లో చెట్ల కిందనే విద్యార్థులు విద్యనభ్యసించే పరిస్థితిలో ఉన్నాయని మంత్రి అన్బిల్‌ మహేష్‌ పొయ్యామొళి తెలిపారు. తిరుచ్చి జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో తిరుచ్చి, కరూర్‌, అరియలూర్‌, పెరంబలూర్‌, పుదుకోట్టై, దిండుక్కల్‌ తదితర జిల్లాలో విద్యాశాఖల సమీక్షా సమావేశం మంత్రి నేతృత్వంలో బుధవారం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ...పాఠశాల విద్యాశాఖకు టీవీ చానల్‌ను గత పాలనలో తీసుకొచ్చారని తెలిపారు. దానిని మరింతగా అభివృద్ధి చేయాలని సమావేశంలో చర్చించామని చెప్పారు. రెండో టీవీ చానల్‌ కావాలని దానిని నిర్వహించేందుకు అధికారపూర్వక ఆదేశాలు జారీ చేశామన్నారు. 79 మంది దీని కోసం ధరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. అర్హత ప్రకారం 11 మందిని తీసుకొని ముగ్గురిని ఎంపిక చేస్తామన్నారు. ఇందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపారు. 2,500 పాఠశాలల్లో చెట్ల కిందనే విద్యార్థులు చదువుకునే పరిస్థితిలో ఉన్నాయన్నారు. కొత్తభవనాలు, తరగతి గదులు, గోడలు నిర్మించేందుకు నిధులు కోరామని చెప్పారు. కొత్తగా 2,500 మంది ఉపాధ్యాయులు ఎంపికై ఉద్యోగంలో త్వరలో చేరనున్నారని తెలిపారు. అదనంగా అవసరమైన ఉపాధ్యాయుల కోసం టెట్‌  జరిపి ఉద్యోగాల్లో చేర్చుకుంటామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మంత్రులు శివశంకర్‌, రఘుపతి, అధికారులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని