logo

10 వేల మందికిపైగా విద్యార్థులకు లబ్ధి

ప్రభుత్వ ఉచిత సైకిలు పథకం కింద తిరువళ్ళూరు జిల్లాలో ఈ విద్యా ఏడాది 10,832 మంది విద్యార్థులు లబ్ధి పొందారని పాడి పరిశ్రమల శాఖ మంత్రి నాజర్‌ తెలిపారు. తిరువళ్ళూరు డీఆర్‌బీసీసీసీ, ఆవడి కామరాజర్‌

Published : 18 Aug 2022 00:44 IST

సైకిలు అందుకున్న విద్యార్థులతో మంత్రి నాజర్‌

తిరువళ్ళూరు, న్యూస్‌టుడే: ప్రభుత్వ ఉచిత సైకిలు పథకం కింద తిరువళ్ళూరు జిల్లాలో ఈ విద్యా ఏడాది 10,832 మంది విద్యార్థులు లబ్ధి పొందారని పాడి పరిశ్రమల శాఖ మంత్రి నాజర్‌ తెలిపారు. తిరువళ్ళూరు డీఆర్‌బీసీసీసీ, ఆవడి కామరాజర్‌ మహోన్నత పాఠశాల, ఇమాక్యులేట్ హృదయమేరి బాలికల మహోన్నత పాఠశాలలలో 11, 12వ తరగతి విద్యార్థులకు ఉచిత సైకిళ్ల పంపిణీని బుధవారం నిర్వహించారు. కలెక్టర్‌ ఆల్పిజాన్‌వర్గీస్‌ ఆధ్వర్యంలో మంత్రి నాజర్‌ ముఖ్యఅతిథిగా మొత్తం 3,074 మందికి రూ.1.55 కోట్ల విలువతో ఉచిత సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల అభివృద్ధికి ముఖ్యమంత్రి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. దురలవాట్లకు దూరంగా ఉండి తమ లక్ష్యాలపై బాలలు దృష్టిపెట్టి ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Read latest Tamilnadu News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts