logo

ఐఐటీఎం ఇంటర్న్‌షిప్‌లో పెరిగిన అవకాశాలు

2022-23 బ్యాచ్‌ విద్యార్థులకు ‘ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ’ మద్రాస్‌ (ఐఐటీఎం) ప్రాంగణ నియామకంలో మొదటి రోజు జరిగిన ఇంటర్న్‌షిప్‌లో 32 శాతం ఆధికంగా అవకాశాలు దక్కాయి. ఈ నెల 6, 13 తేదీల్లో రెండు రోజుల పాటు ఇంటర్న్‌షిప్‌ జరిగిందని ఐఐటీ గురువారం

Published : 19 Aug 2022 02:14 IST

ఇంటర్న్‌షిప్‌లో పాల్గొన్న విద్యార్థులు

వడపళని, న్యూస్‌టుడే: 2022-23 బ్యాచ్‌ విద్యార్థులకు ‘ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ’ మద్రాస్‌ (ఐఐటీఎం) ప్రాంగణ నియామకంలో మొదటి రోజు జరిగిన ఇంటర్న్‌షిప్‌లో 32 శాతం ఆధికంగా అవకాశాలు దక్కాయి. ఈ నెల 6, 13 తేదీల్లో రెండు రోజుల పాటు ఇంటర్న్‌షిప్‌ జరిగిందని ఐఐటీ గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. మొదటిసారి ఆన్‌లైన్‌లో (హైబ్రిడ్‌ మోడ్‌), ప్రత్యక్ష విధానంలో ఇంటర్వ్యూలు జరిగాయి.  ఈ విధానంలో కెనడాకు చెందిన విద్యార్థి కూడా పాల్గొనడం గమనార్హం. యూఎస్‌, యూకే, హాంగ్‌కాంగ్‌, సింగపూర్‌, నెదర్లాండ్స్‌ వంటి దేశాల నుంచి ఉన్నత ప్రతినిధులు విచ్చేసి ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఏడు సంస్థల నుంచి 15 అంతర్జాతీయ ఇంటర్న్‌షిప్‌  అవకాశాలు దక్కడంతో 48 శాతం వరకు పెరిగింది. ఇంటర్న్‌షిప్‌ కోసం ఐఐటీఎంకు విచ్చేసిన సంస్థల సంఖ్య 28 శాతానికి పెరిగింది. ఇంటర్న్‌షిప్‌ విభాగ అడ్వైజర్‌, ఆచార్యులు పి.మురుగవేల్‌ మాట్లాడుతూ.. ‘ప్రొఫెషనల్‌ ఇంటర్న్‌షిప్‌ విద్యార్థుల జీవితంలో ఓ అంతర్భాగం’ లాంటిదన్నారు. టెక్సాస్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ 40, అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ 20, బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌ 17, గోల్డ్‌మెన్‌ శాక్స్‌ 16 మందికి అవకాశాలు కల్పించాయి. విద్యార్థి అకడమిక్‌ అఫైర్స్‌ కార్యదర్శి, టీబీ రామ్‌కమల్‌ ఇంటర్న్‌షిప్‌ డ్రైవ్‌ను సమన్వయం చేయడంలో ఐఐటీఎం విద్యార్థి బృందం చేస్తున్న ప్రయత్నాలను వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని