logo

యుక్త వయస్సులో పొదుపు చేయండి

యుక్తవయస్సులో శ్రమించి డబ్బు పొదుపు చేసుకుంటే వృద్ధాప్యంలో జీవితం హాయిగా సాగుతుందని ధర్మపురి జిల్లా కలెక్టర్‌ శాంతి హితవు పలికారు. ధర్మపురి జిల్లా అరూర్‌ సర్కిల్‌ సిట్లింగ్‌ పంచాయతీ వేలనూర్‌లో గురువారం ప్రజలతో ముఖాముఖి శిబిరం నిర్వహించారు. అధ్యక్షత వహించిన శాంతి మాట్లాడుతూ..

Updated : 19 Aug 2022 06:03 IST

కలెక్టర్‌ హితవు

  ఓ వృద్ధుడికి పింఛను మంజూరు ఉత్తర్వులు అందజేస్తున్న శాంతి

విల్లివాక్కం, న్యూస్‌టుడే: యుక్తవయస్సులో శ్రమించి డబ్బు పొదుపు చేసుకుంటే వృద్ధాప్యంలో జీవితం హాయిగా సాగుతుందని ధర్మపురి జిల్లా కలెక్టర్‌ శాంతి హితవు పలికారు. ధర్మపురి జిల్లా అరూర్‌ సర్కిల్‌ సిట్లింగ్‌ పంచాయతీ వేలనూర్‌లో గురువారం ప్రజలతో ముఖాముఖి శిబిరం నిర్వహించారు. అధ్యక్షత వహించిన శాంతి మాట్లాడుతూ.. యువకులు బాగా చదువుకోవాలన్నారు. తర్వాత ఉద్యోగం దొరకడానికి ఆలస్యమైతే స్వయం ఉపాధికి మార్గాలు వెతుక్కోవాలని చెప్పారు. ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అందజేస్తున్నట్టు గుర్తు చేశారు. వాటిని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాలలో వృద్ధులు పలువురు పొలం పనులు చేస్తుండగా, పలువురు యువకులు చెట్ల కింద సమయాన్ని వృథా చేస్తూ కనిపిస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. యుక్త వయస్సులో సంపాదిస్తేనే వృద్ధాప్యంలో జీవితాన్ని హాయిగా గడపవచ్చని అభిప్రాయపడ్డారు. ఈ శిబిరంలో ఉచిత గృహ పట్టాలు, కుల ధ్రువీకరణ పత్రాలు, కొత్త రేషన్‌ కార్డులు, సామాజిక భద్రతా పథకంలో భాగంగా పింఛను ఉత్తర్వులు మొత్తం 248 మంది లబ్ధిదారులకు రూ. 87.56 లక్షల విలువైన సాయాన్ని శాంతి అందజేశారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని