logo

మహిళకు బంగారం అప్పగింత

తిరునెల్వేలి ఎక్స్ ప్రెస్ రైలులో తెలియకుండా పడిపోయిన రూ.18 లక్షల విలువైన 43 సవర్ల బంగారు ఆభరణాలను రైల్వే పోలీసులు సంబంధిత మహిళకు అప్పగించారు. చెన్నై మేడవాక్కానికి చెందిన హక్కీం బుధవారం కుటుంబంతో కలిసి చెన్నై నుంచి తిరునెల్వేలికి తిరునెల్వేలి ఎక్స్‌ప్రెస్‌ రైలులో

Published : 19 Aug 2022 02:14 IST

హక్కీంకి నగలు అప్పగిస్తున్న రైల్వే పోలీసులు

ట్రిప్లికేన్‌, న్యూస్‌టుడే: తిరునెల్వేలి ఎక్స్ ప్రెస్ రైలులో తెలియకుండా పడిపోయిన రూ.18 లక్షల విలువైన 43 సవర్ల బంగారు ఆభరణాలను రైల్వే పోలీసులు సంబంధిత మహిళకు అప్పగించారు. చెన్నై మేడవాక్కానికి చెందిన హక్కీం బుధవారం కుటుంబంతో కలిసి చెన్నై నుంచి తిరునెల్వేలికి తిరునెల్వేలి ఎక్స్‌ప్రెస్‌ రైలులో బయల్దేరారు. తిరునెల్వేలి జంక్షన్‌లో దిగినప్పుడు తన బంగారు నగల బ్యాగును రైలులోనే విడిచినట్లు గుర్తించారు. ఆమె ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు బోగీలలో గాలించి బ్యాగును గుర్తించారు. అందులో ఉన్న రూ.18 లక్షల విలువైన బంగారు నగలు, రూ.15 వేల నగదును బాధితురాలికి పోలీసులు అప్పగించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని