logo

తమిళ విద్వాంసుడు నెల్లై కణ్ణన్‌ కన్నుమూత

ప్రముఖ తమిళ విద్యాంసుడు, సాహితీవేత్త నెల్లై కణ్ణన్‌ (77) తిరునెల్వేలి టౌన్‌ అమ్మన్‌ సన్నది వీధిలో ఉన్న తన ఇంట్లో వృద్ధాప్యం, అనారోగ్యం కారణంగా గురువారం మృతిచెందారు. రైతు కుటుంబలో పుట్టిన ఆయన తమిళంపై ప్రత్యేకంగా ఆసక్తి చూపేవారు. భారతీ పాటలు, తమిళ సాహిత్య గ్రంథాల్లో మంచి ప్రావీణ్యం ఉంది.

Published : 19 Aug 2022 02:14 IST

నెల్లై కణ్ణన్‌  భౌతికకాయం

తిరునెల్వేలి, న్యూస్‌టుడే: ప్రముఖ తమిళ విద్యాంసుడు, సాహితీవేత్త నెల్లై కణ్ణన్‌ (77) తిరునెల్వేలి టౌన్‌ అమ్మన్‌ సన్నది వీధిలో ఉన్న తన ఇంట్లో వృద్ధాప్యం, అనారోగ్యం కారణంగా గురువారం మృతిచెందారు. రైతు కుటుంబలో పుట్టిన ఆయన తమిళంపై ప్రత్యేకంగా ఆసక్తి చూపేవారు. భారతీ పాటలు, తమిళ సాహిత్య గ్రంథాల్లో మంచి ప్రావీణ్యం ఉంది. అనర్గళంగా మాట్లాడే వ్యక్తి కావడంతో పలు చర్చల్లో పాల్గొనే వారు. కాంగ్రెస్‌లో చిన్నవయస్సు నుంచే పనిచేశారు. టీఎన్‌సీసీ ప్రధాన కార్యదర్శి, ఉపాధ్యాక్షుడిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన అంత్యక్రియలు శుక్రవారం మధ్యాహ్నం జరగనున్నాయి. నెల్లై కణ్ణన్‌ మృతదేహానికి అన్నాడీఎంకే కార్యదర్శి సుధా పరమశివన్‌, జిల్లా ప్రిసిడీయం ఛైర్మన్‌ భరణి శంకరలింగం తదితర నేతలు సంతాపం తెలిపారు.
సీఎం సంతాపం..
చెన్నై: నెల్లై కణ్ణన్‌ మృతికి ముఖ్యమంత్రి స్టాలిన్‌ సంతాపం తెలిపారు. రాష్ట్రంలోని సీనియర్‌ నేతలతో సన్నిహితంగా మెలిగే ఆయన మృతికి ఆవేదన చెందుతున్నానని తెలిపారు. గత ఏడాది వీసీకే అందించిన కామరాజర్‌ కదిర్‌ పురస్కారం పొందిన సందర్భంగా వేదికపై తనతో ఆప్యాయంగా మాట్లాడారని, ఇళంగోవడిగళ్‌ పురస్కారంతో ఆయన్ను రాష్ట్ర ప్రభుత్వం సత్కరించిందని గుర్తు చేశారు. ఆయన్ను కోల్పోయి బాధపడుతున్న కుటుంబానికి సానుభూతి తెలిపారు.

నివాళులర్పిస్తున్న మంత్రులు

తిరునెల్వేలి: నెల్లై కణ్ణన్‌ భౌతికకాయానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులు రామచంద్రన్‌, ఆర్‌ఎస్‌ రాజకన్నప్పన్‌, మాజీ స్పీకరు ఆవుడైయప్పన్‌, జిల్లా కలెక్టరు విష్ణు, మేయర్‌ శరవణన్‌, డిప్యూటీ మేయర్‌ రాజు స్థానిక సంస్థల ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు అంజలి ఘటించారు.
సీపీఎం తరఫున..: నెల్లై కణ్ణన్‌ మృతికి సంతాపం వ్యక్తం చేస్తున్నట్టు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బాలకృష్ణన్‌ తెలిపారు. 60ఏళ్లకు పైగా సాహిత్య వేదికలపై ఉపన్యాసాలు చేశారని, న్యాయనిర్ణేతగా వ్యవహరించారని పేర్కొన్నారు. వామపక్షాలపై అపార గౌరవం కలిగిన ఆయన సీపీఎం నిర్వహించిన పలు సదస్సుల్లో పాల్గొన్నారని తెలిపారు. మద్దతుగా ఎన్నికల్లో ప్రచారం కూడా చేశారని పేర్కొన్నారు. ఆయన మృతి తీరని లోటు అన్నారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని