logo

బాలికకు మెరుగైన చికిత్స అందిస్తాం: మంత్రి నాజర్‌

అరుదైన ముఖ వైకల్యంతో బాధపడుతున్న బాలికకు చికిత్స అందించడానికి 9 వైద్య బృందాలను ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నట్లు మంత్రి నాజర్‌ తెలిపారు. తిరువళ్లూరు జిల్లా ఆవడి వీరాపురానికి చెందిన తొమ్మిదేళ్ల చిన్నారికి అరుదైన ముఖ వైకల్యంతో బాధపడుతోంది. ఇందుకు సంబంధించి వార్తా పత్రికల్లో వార్త ప్రచురితమైంది.

Published : 19 Aug 2022 02:14 IST

బాలికను పరామర్శిస్తున్న నాజర్‌

ప్యారిస్‌, న్యూస్‌టుడే: అరుదైన ముఖ వైకల్యంతో బాధపడుతున్న బాలికకు చికిత్స అందించడానికి 9 వైద్య బృందాలను ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నట్లు మంత్రి నాజర్‌ తెలిపారు. తిరువళ్లూరు జిల్లా ఆవడి వీరాపురానికి చెందిన తొమ్మిదేళ్ల చిన్నారికి అరుదైన ముఖ వైకల్యంతో బాధపడుతోంది. ఇందుకు సంబంధించి వార్తా పత్రికల్లో వార్త ప్రచురితమైంది. దీంతో బాధిత బాలికను జిల్లా కలెక్టరు అల్ఫిజాన్‌వర్గీస్‌ కలిశారు. బాలికకు వైద్య చికిత్స ఖర్చులు భరించడానికి సిద్ధంగా ఉన్నట్లు, చికిత్స ముగిసిన తరువాత బాలిక కుటుంబానికి ప్రభుత్వం తరఫున ఇల్లు కేటాయిస్తారని తెలిపారు. ఈ నేపథ్యంలో గురువారం ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్సకు చేరిన బాలికను మంత్రి నాజర్‌, కలెక్టరు అల్ఫిజాన్‌ వర్గీస్‌, ఎమ్మెల్యే సుదర్శనం తదితరులు పరామర్శించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. బాలిక వేదనను అర్థం చేసుకున్న ముఖ్యమంత్రి చికిత్స అందించడానికి చర్యలు చేపట్టారన్నారు. ప్రస్తుతం బాలికకు కలైజ్ఞర్‌ బీమా పథకం కింద అన్ని వైద్య సదుపాయాలను ఏర్పాటు చేశారన్నారు. ఇందుకుగాను ప్రత్యేకంగా తొమ్మిది వైద్య బృందాలను ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. త్వరలో బాలిక కోలుకుంటుందని, బాలిక తల్లిదండ్రులకు ఉద్యోగం, ఉండేందుకు స్థలం కేటాయించేందుకు చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని