logo

తిరుచ్చెందూర్‌ ఆలయాభివృద్ధికి ప్రాధాన్యం

తిరుమలకు దీటుగా తిరుచ్చెందూర్‌ ఆలయాన్ని తీర్చిదిద్దేందుకు పనులు ప్రారంభమయ్యాయని దేవదాయశాఖ మంత్రి శేఖర్‌బాబు తెలిపారు.  తూత్తుకుడి జిల్లా శ్రీవైకుంఠం సమీపంలోని ఆళ్వార్‌ తిరునగరి, ఆదినాథర్‌ ఆళ్వార్‌ ఆలయాలలో ఆదినాయకి అనే ఏనుగు, తిరుకొళ్లూర్‌ వైద్దమానిది ఆలయంలో కుముదవల్లి అనే ఏనుగు, దేవర్‌ప్రాణ ఆలయంలో లక్ష్మి అనే ఏనుగు ఉన్నాయి.

Published : 25 Sep 2022 06:20 IST

మంత్రి శేఖర్‌బాబు

ఆలయంలో పరిశీలిస్తున్న మంత్రులు శేఖర్‌బాబు

ఆర్కేనగర్‌, న్యూస్‌టుడే: తిరుమలకు దీటుగా తిరుచ్చెందూర్‌ ఆలయాన్ని తీర్చిదిద్దేందుకు పనులు ప్రారంభమయ్యాయని దేవదాయశాఖ మంత్రి శేఖర్‌బాబు తెలిపారు.  తూత్తుకుడి జిల్లా శ్రీవైకుంఠం సమీపంలోని ఆళ్వార్‌ తిరునగరి, ఆదినాథర్‌ ఆళ్వార్‌ ఆలయాలలో ఆదినాయకి అనే ఏనుగు, తిరుకొళ్లూర్‌ వైద్దమానిది ఆలయంలో కుముదవల్లి అనే ఏనుగు, దేవర్‌ప్రాణ ఆలయంలో లక్ష్మి అనే ఏనుగు ఉన్నాయి. ఈ ఏనుగులు ఉత్సవాల సమయాల్లో పాల్గొంటాయి. ఈ నేపథ్యంలో ఈ ఏనుగులను సంరక్షించేందుకు శ్రీవైకుంఠం వద్ద ఆళ్వార్‌తోప్పు ఏకాంత లింగేశ్వరర్‌స్వామి ఆలయానికి సొంతమైన స్థలంలో ఏనుగుల సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేశారు. ఇందులో టీవీఎస్‌ కంపెనీ శ్రీనివాస సేవా ఛారిటబుల్‌ ట్రస్టు తరఫున రూ.86 లక్షల వ్యయంతో ఏనుగులు ఉండేందుకు, స్నానం చేసేందుకు ప్రత్యేకంగా స్థలం కేటాయించారు. ఈ ఏనుగుల సంరక్షణ కేంద్రాన్ని శుక్రవారం మంత్రి శేఖర్‌బాబు ప్రారంభించారు. కేటాయించిన స్థలం చిన్నదిగా ఉండడంతో విస్తరించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఏకాంతలింగేశ్వరుని ఆయన దర్శించుకున్నారు. అనంతరం తిరుచ్చెందూర్‌ ఆలయంలో మంత్రులు శేఖర్‌బాబు, అనితారాధాకృష్ణన్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి శేఖర్‌బాబు విలేకరులతో మాట్లాడుతూ... తిరుచ్చెందూర్‌ ఆలయాన్ని తిరుమలకు దీటుగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ప్రైవేట్ సహకారంతో రూ.300 కోట్ల వ్యయంతో ప్రాజెక్ట్‌ పనులు ప్రారంభించినట్లు పేర్కొన్నారు. కులశేఖరపట్టిణం ముత్తారమ్మన్‌ ఆలయంలో జరిగే దసరా ఉత్సవాల సందర్భంగా ముందస్తు ఏర్పాట్ల గురించి చర్చించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని