logo

వాతావరణ మార్పుతోనే జ్వరాలు

వాతావరణ మార్పు వలనే జ్వరాలు వస్తున్నాయని మంత్రి మా.సుబ్రమణియన్‌ తెలిపారు. తూత్తుకుడి జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు శుక్రవారం ఉదయం ఆరోగ్యశాఖ మంత్రి మా.సుబ్రమణియన్‌ తూత్తుకుడి విమానాశ్రయానికి చేరుకున్నారు.

Published : 25 Sep 2022 06:21 IST

మంత్రి మా.సుబ్రమణియన్‌

శిబిరాన్ని పరిశీలిస్తున్న మంత్రులు మా.సుబ్రమణియన్‌, అనితా రాదాకృష్ణన్‌, ఎంపీ కనిమొళి

ఆర్కేనగర్‌, న్యూస్‌టుడే: వాతావరణ మార్పు వలనే జ్వరాలు వస్తున్నాయని మంత్రి మా.సుబ్రమణియన్‌ తెలిపారు. తూత్తుకుడి జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు శుక్రవారం ఉదయం ఆరోగ్యశాఖ మంత్రి మా.సుబ్రమణియన్‌ తూత్తుకుడి విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ... రాష్ట్రంలో రెండు రోజుల క్రితం ఒకే రోజు వెయ్యి చోట్ల జ్వర పరీక్షల ప్రత్యేక శిబిరాలు నిర్వహించినట్లు తెలిపారు. రాష్ట్రంలో వాతావరణ మార్పు కారణంగానే జ్వరాలు వస్తున్నాయని పేర్కొన్నారు. ఇది వైరల్‌ జ్వరాలు కాదన్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కరోనా బూస్టర్‌ టీకా ప్రతి బుధవారాలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో, ప్రభుత్వ ఆస్పత్రులలో 11,333 వైద్య కేంద్రాలలో వేస్తున్నట్లు తెలిపారు. మొదటి డోస్‌ 94 శాతం, రెండో డోస్‌ 92 శాతం మంది వేయించుకున్నట్లు చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రులలో మందుల కొరత లేదన్నారు. అనంతరం తూత్తుకుడి జిల్లా నత్తకులం గ్రామంలో జరుగుతున్న జ్వర పరీక్షల ప్రత్యేక శిబిరాన్ని మంత్రి మా.సుబ్రమణియన్‌, ఎంపీ కనిమొళి, మత్స్యశాఖ మంత్రి అనితా రాధాకృష్ణన్‌ పరిశీలించారు. కాయమొళి గ్రామంలో రూ.5 లక్షల వ్యయంతో నిర్మించిన ఆస్పత్రి భవనాలను ప్రారంభించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని