logo

115 మంది ఖైదీల విడుదల

అన్నా జయంతి, 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని రాష్ట్రంలో 115 మంది ఖైదీలను విడుదల చేసినట్లు జైలుశాఖ తెలిపింది.  పదేళ్లకుపైగా జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలను నిబంధనల ప్రకారం

Published : 25 Sep 2022 01:27 IST

ప్యారిస్‌, న్యూస్‌టుడే: అన్నా జయంతి, 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని రాష్ట్రంలో 115 మంది ఖైదీలను విడుదల చేసినట్లు జైలుశాఖ తెలిపింది.  పదేళ్లకుపైగా జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలను నిబంధనల ప్రకారం విడుదల చేయవచ్చని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం సూచనలు ఇచ్చింది. ఈ మేరకు ఖైదీలను విడుదల చేయడానికి అర్హులను గుర్తించడానికి విధివిధానాలను విడుదల చేశారు. 10 ఏళ్లు జైల్లో ఉన్న ఖైదీల్లో సత్ప్రవర్తనతో ఉన్న వారిని విడుదల చేయవచ్చని పేర్కొన్నారు. అత్యాచారం, ఉగ్రవాద నేరాలు, కిడ్నాప్‌ మొదలైన కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న వారు అనర్హులని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 9 సెంట్రల్‌ జైల్లో ఉన్న ఎంపికైన ఖైదీలను విడుదల చేస్తున్నారు. అన్నా జయంతి సందర్భంగా  96 మంది ఖైదీలను, 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని 19 మంది మొత్తం 115 మంది ఖైదీలను విడుదల చేశారు. క్రమంగా ఖైదీలను విడుదల చేస్తామని జైలుశాఖ అధికారులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని