logo

పురస్కారాలకు ప్రతిపాదనల ఆహ్వానం

పురస్కారాలకు ప్రతిపాదనలను రాష్ట్రానికి చెందిన అర్హులైన వ్యక్తులు, సంస్థల నుంచి ఆహ్వానిస్తున్నట్టు రాజ్‌భవన్‌ ప్రకటించింది. ఈ మేరకు శనివారం విడుదల చేసిన ప్రకటనలో... సామాజిక సేవ, పర్యావరణ పరిరక్షణ రంగాల్లో

Published : 25 Sep 2022 01:35 IST

చెన్నై, న్యూస్‌టుడే: పురస్కారాలకు ప్రతిపాదనలను రాష్ట్రానికి చెందిన అర్హులైన వ్యక్తులు, సంస్థల నుంచి ఆహ్వానిస్తున్నట్టు రాజ్‌భవన్‌ ప్రకటించింది. ఈ మేరకు శనివారం విడుదల చేసిన ప్రకటనలో... సామాజిక సేవ, పర్యావరణ పరిరక్షణ రంగాల్లో అంకితభావంతో సేవలు అందిస్తున్న వ్యక్తులు, సంస్థలను గుర్తించడానికి ప్రతి ఏడాది పురస్కారాలు ప్రదానం చేయాలని గవర్నర్‌ రవి తొలిసారి నిర్ణయించారని తెలిపింది. పురస్కార గ్రహీతలకు ధ్రువపత్రంతోపాటు రూ.10 లక్షల నగదు బహుమతి ఉంటుంది. ప్రతిపాదనలను అక్టోబరు 30 సాయంత్రం 5 గంటల్లోపు చేరేల్చా‌ °awardsrajbhavantamilnadu@gmail.com అనే ఇమెయిల్‌ చిరునామాకు పంపొచ్చు.
వ్యాసరచన పోటీలకు..
వేలచ్చేరి, న్యూస్‌టుడే: వన్యప్రాణుల భద్రతా వారోత్సవాల సందర్భంగా నిర్వహించే వ్యాసరచన పోటీల్లో పాల్గొనే విద్యార్థులు ఈనెల 28వ తేదీ సాయంత్రం 5.30 గంటల్లోపు పేర్లు పంపాలని అన్నామలై టైగర్‌ రిజర్వు ఫారెస్టు అసిస్టెంటు డైరెక్టర్‌ కే గణేశరాం తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఏటా అక్టోబరు 2 నుంచి 8వ తేదీ వరకు వన్యప్రాణుల భద్రతా వారోత్సవాలను నిర్వహిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా అటవీశాఖ తరఫున విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్‌, డ్రాయింగు పోటీలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశామన్నారు.  తెలిపారు. పాల్గొనే విద్యార్థులు 28వ తేదీ సాయంత్రంలోగా
2020artpr@ gmail.com మెయిల్‌ఐడీకి పేర్లు పంపాలని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని