logo

కోవై జిల్లాలో పటిష్ట పోలీసు భద్రత

కోయంబత్తూరు నగరంలోని కొన్ని ప్రాంతాల్లో గురువారం రాత్రి జరిగిన పెట్రోల్‌ బాంబు దాడులతో నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దీంతో జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు, ప్రత్యేక బలగాలు

Published : 25 Sep 2022 01:35 IST

భద్రతా విధుల్లో ప్రత్యేక బలగాలు

కోయంబత్తూరు, న్యూస్‌టుడే: కోయంబత్తూరు నగరంలోని కొన్ని ప్రాంతాల్లో గురువారం రాత్రి జరిగిన పెట్రోల్‌ బాంబు దాడులతో నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దీంతో జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు, ప్రత్యేక బలగాలు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాయి. ఈ ఘటనలను ఖండిస్తూ భాజపా, హిందూ మున్నని కార్యకర్తలు ఆందోళన చేపడుతున్నారు. దీంతో జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఇతర జిల్లాల నుంచి 1700 మందికి పైగాబ పోలీసులు కోయంబత్తూరుకి చేరుకున్నారు. అదనంగా 28 చోట్ల వాహనాల తనిఖీ చేపట్టారు. రైల్వేస్టేషన్‌లో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని