logo

నిరసనలకు వైద్యుల సంఘ ఎన్నికలే కారణం

వైద్యుల సంఘ ఎన్నికలే వైద్యుల నిరసనలకు కారణమని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి మా.సుబ్రమణియన్‌ పేర్కొన్నారు. చెన్నై నుంగంబాక్కంలోని నగర ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా టీకా శిబిరాన్ని ఆదివారం ఆయన ప్రారంభించి పరిశీలించారు.

Published : 26 Sep 2022 05:52 IST

మంత్రి మా సుబ్రమణియన్‌

శిబిరాన్ని పరిశీలిస్తున్న మా సుబ్రమణియన్‌

వేలచ్చేరి, న్యూస్‌టుడే: వైద్యుల సంఘ ఎన్నికలే వైద్యుల నిరసనలకు కారణమని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి మా.సుబ్రమణియన్‌ పేర్కొన్నారు. చెన్నై నుంగంబాక్కంలోని నగర ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా టీకా శిబిరాన్ని ఆదివారం ఆయన ప్రారంభించి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి విలేకర్లతో మాట్లాడుతూ... రాష్ట్ర వ్యాప్తంగా 50 వేల ప్రాంతాల్లో 38వ కరోనా వ్యాక్సినేషన్‌ శిబిరాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. బూస్టర్‌ టీకాలను కేంద్రం ఉత్తర్వుల మేరకు ఈనెల 30వ తేదీ వరకు వేస్తామని, తరువాత కేంద్రం అనుమతిస్తే కొనసాగిస్తామని తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 96.55 శాతం మంది మొదటి డోస్‌, 91.39 శాతం మంది రెండవ డోస్‌ను వేయించుకున్నట్లు పేర్కొన్నారు. అక్టోబరు నుంచి ప్రతి బుధవారం అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో గర్భిణులకు కరోనా వ్యాక్సిన్‌తో పాటు 13 రకాల టీకాలు వేయనున్నారని, 12 నుంచి 17 ఏళ్ల లోపు బాలబాలికలకు ప్రతి గురువారాల్లో పాఠశాలల్లో వ్యాక్సిన్‌ వేస్తారని తెలిపారు. ఇప్పటివరకు  20.04 శాతం మంది బూస్టర్‌ డోస్‌ వేయించుకున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ వైద్యులు నాలుగు అంశాల డిమాండ్లతో నిరసన కొనసాగిస్తున్నారని, రాష్ట్రంలో అనేక వైద్య సంఘాలు ఉన్నాయని, ఈ సంఘాలకు వచ్చే నెల 14న ఎన్నికలు జరగనున్నట్లు తెలిపారు. ఇందుకే ఇలాంటి నిరసనలు జరుగుతున్నాయన్నారు. ఎన్నికలు ముగిసిన తరువాత నిరసనలు ఉండవని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని