logo

డీఎంకే సర్వసభ్య సమావేశం 12న?

డీఎంకే సర్వసభ్య సమావేశం 12వ తేదీ జరగనున్నట్లు ప్రచారం జరుగుతోంది. డీఎంకే జిల్లా కార్యదర్శుల పదవులకు నామపత్రాల సమర్పణ ఆదివారంతో ముగిసింది. నెలాఖరులోపు జిల్లా కార్యదర్శుల జాబితా విడుదల కానుంది. ఆ తర్వాత పార్టీ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, కోశాధికారి తదితర పదవులకు నామపత్రాల దాఖలు ప్రారంభంకానుంది.

Published : 26 Sep 2022 02:04 IST

చెన్నై, న్యూస్‌టుడే: డీఎంకే సర్వసభ్య సమావేశం 12వ తేదీ జరగనున్నట్లు ప్రచారం జరుగుతోంది. డీఎంకే జిల్లా కార్యదర్శుల పదవులకు నామపత్రాల సమర్పణ ఆదివారంతో ముగిసింది. నెలాఖరులోపు జిల్లా కార్యదర్శుల జాబితా విడుదల కానుంది. ఆ తర్వాత పార్టీ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, కోశాధికారి తదితర పదవులకు నామపత్రాల దాఖలు ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో అక్టోబరు 12న సర్వసభ్య సమావేశం ఏర్పాటు కానుందని, ఇందులో డీఎంకే అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి, కోశాధికారి పదవులకు ఎన్నికైనవారిని ప్రకటిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి స్టాలిన్‌ను రెండోసారిగా అధ్యక్షుడిగా ఎన్నుకోనున్నారని సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని