logo

వెండి బొమ్మల కొలువు

టీనగర్‌లోని చల్లాని హౌస్‌లో నవరాత్రి బొమ్మల ప్రదర్శన ఏర్పాటైంది.  పూర్తిగా వెండి విగ్రహాలు, దేవతా మూర్తులతో మొదటిసారి భారత్‌లో ప్రదర్శనను ఏర్పాటు చేసినట్లు చల్లాని సంస్థ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది.

Published : 26 Sep 2022 05:51 IST

ఏర్పాటైన ప్రదర్శన

వడపళని, న్యూస్‌టుడే: టీనగర్‌లోని చల్లాని హౌస్‌లో నవరాత్రి బొమ్మల ప్రదర్శన ఏర్పాటైంది.  పూర్తిగా వెండి విగ్రహాలు, దేవతా మూర్తులతో మొదటిసారి భారత్‌లో ప్రదర్శనను ఏర్పాటు చేసినట్లు చల్లాని సంస్థ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. దశావతారం, అష్టలక్ష్మి, కుబేరుడు, మహాభారతం, రామాయణాలకు సంబంధించిన బొమ్మలు ప్రదర్శనలో కొలువుదీరాయి. ప్రదర్శన 26వ తేదీ నుంచి అక్టోబరు 4వ తేదీ వరకు సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు ఉంటుందని నిర్వాహకులు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని