logo

అభివృద్ధికి కేంద్ర సహకారం ముఖ్యం

త్వరిత అభివృద్ధికి కేంద్రం నుంచి సహకారం, సత్వర అనుమతులు అవసరమని పుదువై ముఖ్యమంత్రి రంగస్వామి తెలిపారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా సోమవారం సదస్సు జరిగింది. కరువడికుప్పంలోని కామరాజర్‌ స్మారక మండపంలో

Published : 27 Sep 2022 01:24 IST

కార్యక్రమంలో రంగస్వామి ప్రసంగిస్తున్న దృశ్యం

చెన్నై, న్యూస్‌టుడే: త్వరిత అభివృద్ధికి కేంద్రం నుంచి సహకారం, సత్వర అనుమతులు అవసరమని పుదువై ముఖ్యమంత్రి రంగస్వామి తెలిపారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా సోమవారం సదస్సు జరిగింది. కరువడికుప్పంలోని కామరాజర్‌ స్మారక మండపంలో నిర్వహించిన కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... పర్యాటక రంగం ద్వారా ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం లభిస్తోందని తెలిపారు. మణపట్టులోని 150 ఎకరాల స్థలాన్ని అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రంగా మార్చాలని పేర్కొన్నారు. పర్యాటకులకు పుదువైలో 2 వేల గదులు అవసరమని, వాటిని నిర్మించడానికి పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. నల్లవాడు బీచ్‌ తదితర ప్రాంతాల్లో 4 ఏళ్లుగా వీటిని నిర్మాణానికి ప్రయత్నిస్తున్నా అనుమతి ఇవ్వలేదని పారిశ్రామికవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో పర్యాటకశాఖ మంత్రి లక్ష్మీనారాయణన్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Tamilnadu News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని