logo

భాష ఆధారంగా దేశాన్ని విడదీయలేరు

భాష ప్రాతిపదికన దేశాన్ని ఎవరూ విడదీయలేరని మాజీ ఎంపీ, భాజపా సీనియర్‌ నేత సుబ్రమణ్యస్వామి తెలిపారు. మదురై రాష్ట్ర వర్తక సంఘ కార్యాలయంలో ఆయన జన్మదిన వేడుక సోమవారం జరిగింది. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ...

Published : 27 Sep 2022 01:24 IST

భాజపా నేత సుబ్రమణ్యస్వామి

సుబ్రమణ్యస్వామికి వేల్‌ బహూకరిస్తున్న పార్టీ నిర్వాహకులు

ఆర్కేనగర్, న్యూస్‌టుడే: భాష ప్రాతిపదికన దేశాన్ని ఎవరూ విడదీయలేరని మాజీ ఎంపీ, భాజపా సీనియర్‌ నేత సుబ్రమణ్యస్వామి తెలిపారు. మదురై రాష్ట్ర వర్తక సంఘ కార్యాలయంలో ఆయన జన్మదిన వేడుక సోమవారం జరిగింది. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ... త్వరలో దేశంలో పెద్దమార్పు రానుందన్నారు. దేశ సంస్కృతిని దోచుకునేవారిని నాశనం చేయాలని, ఆర్థికంగా వెనుకబడిపోయామని చెప్పారు. మనం ఒకప్పుడు తొలిస్థానంలో ఉండేవారమని, వ్యాపారం పేరిట వచ్చి మనల్ని విడదీసి ఆర్థికంగా కొందరు దెబ్బతీశారని తెలిపారు. దేశం రాణించాలంటే ఆర్థిక, సైనికబలం ఉండాలన్నారు. భాషల్లో తమిళం ముఖ్యమైనదేనన్నారు. హిందీ నేర్చుకుంటే తప్పేంటని ప్రశ్నించారు. కచ్చితంగా నేర్చుకోవాలని తాను అనడం లేదన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఆధీనంలో ఉన్న 32 ఆలయాలకు విముక్తి కల్పించాలన్నారు. దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో కేసు విచారణలో ఉందని, కోర్టు తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు పంపినట్లు తెలిపారు. ఇప్పటివరకు ప్రభుత్వం సమాధానం దాఖలు చేయలేదన్నారు. డీఎంకే రోజుకొక అబద్ధం చెబుతోందని ఆరోపించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యామ్నాయ పార్టీగా భాజపా అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని