logo

పాలారు నదిపై జలాశయం నిర్మించలేదు

పాలారు నదిపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జలాశయం నిర్మిస్తోందని ప్రతిపక్ష నాయకుడైన ఎడప్పాడి పళనిస్వామి చేసిన ఆరోపణలో నిజం లేదని జలవనరుల శాఖ మంత్రి దురైమురుగన్‌ వ్యాఖ్యానించారు. సోమవారం ఆయన విడుదల చేసిన ప్రకటనలో..

Published : 27 Sep 2022 01:24 IST

ఎడప్పాడికి దురైమురుగన్‌ సమాధానం

గిండి, న్యూస్‌టుడే: పాలారు నదిపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జలాశయం నిర్మిస్తోందని ప్రతిపక్ష నాయకుడైన ఎడప్పాడి పళనిస్వామి చేసిన ఆరోపణలో నిజం లేదని జలవనరుల శాఖ మంత్రి దురైమురుగన్‌ వ్యాఖ్యానించారు. సోమవారం ఆయన విడుదల చేసిన ప్రకటనలో.. పళనిస్వామి పరిపాలనలో ఇలాంటి నిర్మాణాలు జరుగనందున ప్రభుత్వ యంత్రాంగంలోని వ్యవహారాలు ఆయనకు తెలియవన్నారు. డీఎంకే ప్రభుత్వంపై ఎడప్పాడి విమర్శలు హాస్యాస్పదమన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పాలారు నదిపై కొత్తగా డ్యాం నిర్మించనున్నదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక బహిరంగ సభలో చెప్పారని దురైమురుగన్‌ తెలిపారు. అంతమాత్రానికే నిర్మించేసినట్లుగానే ఎడప్పాడి పేర్కొనడం భావ్యం కాదన్నారు. గతంలో ఒకసారి ఆంధ్రప్రదేశ్‌లోని గణేశ్‌పురం వద్ద ఇలా ఆనకట్ట నిర్మాణం జరుగుతోందని కొంతమంది తమిళ నాయకులు పత్రికా ప్రకటనలు ఇవ్వగా.. ముఖ్యమంత్రి స్టాలిన్, తాను కలిసి అక్కడికెళ్లి చూశామన్నారు. కనీసం నిర్మాణ ఆనవాలు అక్కడ కనపించలేదన్నారు. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టులో నడుస్తున్న కేసులను తమ ప్రభుత్వం పర్యవేక్షిస్తోందన్నారు. ఒకవేళ అటువంటి ప్రయత్నాలు జరిగితే వ్యతిరేకత తెలిపి అడ్డుకుంటామని హామీ ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని