logo

విడుదలకు సిద్ధమవుతున్న రవాళి

‘ఆత్తా ఉన్‌ కోవిలే’, ‘తమిళ్‌ పొన్ను’, ‘మిట్టా విరాసు’ వంటి చిత్రాల్లో హీరోగా నటించిన రవిరాహుల్‌ శివరత్తా ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానరుపై తెరకెక్కించిన చిత్రం ‘రవాళి’. జై ఆనంద్, ఏఎస్‌ మైఖేెల్‌ సంయుక్తంగా సంగీతం అందించారు. ట్రైలర్‌ విడుదల

Published : 27 Sep 2022 01:24 IST

ట్రైలర్‌ విడుదల దృశ్యం

కోడంబాక్కం, న్యూస్‌టుడే: ‘ఆత్తా ఉన్‌ కోవిలే’, ‘తమిళ్‌ పొన్ను’, ‘మిట్టా విరాసు’ వంటి చిత్రాల్లో హీరోగా నటించిన రవిరాహుల్‌ శివరత్తా ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానరుపై తెరకెక్కించిన చిత్రం ‘రవాళి’. జై ఆనంద్, ఏఎస్‌ మైఖేెల్‌ సంయుక్తంగా సంగీతం అందించారు. ట్రైలర్‌ విడుదల కార్యక్రమం చెన్నైలో జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. ‘‘ఉత్తరాది రాష్ట్రం నుంచి తాపీ పని కోసం వచ్చిన ఓ యువకుడు ఇక్కడి అమ్మాయి ప్రేమలో పడతాడు. ఆమె కూడా ప్రేమిస్తుంది. ఇద్దరూ పారిపోయి పెళ్లి చేసుకుంటారు. తర్వాత ఏమైందన్నదే మిగిలిన కథ. సిద్ధార్థ్‌ అనే హిందీ వ్యక్తి ఇందులో హీరోగా నటించారు. ఆయనకు తమిళం నేర్పించి ఇందులో మాట్లాడించా. మేం అనుకున్న దానికన్నా సినిమా అద్భుతంగా వచ్చింది. మంచి ప్రేమకథా చిత్రంగా గుర్తింపు తెచ్చుకుంటుందనే నమ్మకం మా అందరికీ ఉంది. త్వరలోనే విడుదల చేస్తామని’’ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని