logo

మా ఆయన హిట్లే ఇస్తారు: ఖుష్బూ

సుందర్‌.సి దర్శకత్వంలో జీవా, జీవా, శ్రీకాంత్, సంయుక్త, మాళవిక శర్మ, అమృత అయ్యర్, సంచితా శెట్టి తదితరులు నటించిన చిత్రం ‘కాఫీ విత్‌ కాదల్‌’. యువన్‌శంకర్‌రాజా సంగీతం సమకూర్చారు. అక్టోబరు 7న చిత్రం విడుదల కానుంది.

Published : 27 Sep 2022 01:24 IST

ట్రైలర్‌ విడుదల దృశ్యం

కోడంబాక్కం, న్యూస్‌టుడే: సుందర్‌.సి దర్శకత్వంలో జీవా, జీవా, శ్రీకాంత్, సంయుక్త, మాళవిక శర్మ, అమృత అయ్యర్, సంచితా శెట్టి తదితరులు నటించిన చిత్రం ‘కాఫీ విత్‌ కాదల్‌’. యువన్‌శంకర్‌రాజా సంగీతం సమకూర్చారు. అక్టోబరు 7న చిత్రం విడుదల కానుంది. ఖుష్బూ నిర్మించిన ఈ చిత్రాన్ని రెడ్‌జైంట్‌ మూవీస్‌ సంస్థ విడుదల చేస్తోంది. ఈ సినిమా ట్రైలర్, పాటల విడుదల కార్యక్రమం చెన్నైలో జరిగింది. సుందర్‌.సి మాట్లాడుతూ.. ‘‘ఎప్పటిలాగే ఈ సినిమా చిత్రీకరణలో నటులందరూ చాలా అల్లరి చేశారు. త్వరగా షూటింగ్‌ పూర్తి చేశాం. వినోదానికి ఏమాత్రం కొదవ ఉండదని’’ పేర్కొన్నారు. ఖుష్బూ మాట్లాడుతూ.. ‘‘నా నిర్మాణంలో మా ఆయన సుందర్‌.సి దర్శకత్వంలో వచ్చిన సినిమాలన్నీ మంచి విజయం సాధించాయి. ఇది కూడా తప్పకుండా హిట్‌ అవుతుంది. సినిమా ఆసాంతం వినోదాత్మకంగా ఉంటుందని’’ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని