logo

పెట్రోలు బాంబులు విసిరిన నలుగురి అరెస్టు

భాజపా నేత దుకాణంపై పెట్రోలు బాంబులు విసిరిన నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వారి కథనం మేరకు... ఈరోడ్‌ మూలప్పాళయంలో భాజపా నేత దక్షిణామూర్తి (51) ఫర్నిచర్‌ దుకాణం నిర్వహిస్తున్నారు. రెండు రోజుల క్రితం

Published : 27 Sep 2022 01:24 IST

నిందితులు 

విల్లివాక్కం, న్యూస్‌టుడే: భాజపా నేత దుకాణంపై పెట్రోలు బాంబులు విసిరిన నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వారి కథనం మేరకు... ఈరోడ్‌ మూలప్పాళయంలో భాజపా నేత దక్షిణామూర్తి (51) ఫర్నిచర్‌ దుకాణం నిర్వహిస్తున్నారు. రెండు రోజుల క్రితం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దుకాణంపై పెట్రోలు బాంబులు విసిరి పారిపోయారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాల ఆధారంగా నలుగురితో కూడిన ముఠాను గుర్తించారు. ఎస్‌డీపీఐ పార్టీకి చెందిన కరుంగల్‌పాలయం జగన్‌ వీధికి చెందిన సద్దాంహుసేన్‌ (25), బీబీ అగ్రహారం కైకోళర్‌ వీధికి చెందిన ఖలీల్‌రహ్మాన్‌ (27), ఇంధిరా నగర్‌కి చెందిన జాఫర్‌సాదిక్‌ (27), ఇతని తమ్ముడు ఆసిక్‌ అలీని (23) అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచి సోమవారం జైలుకు తరలించారు.

మరో ఇద్దరు...

ఆర్కేనగర్, న్యూస్‌టుడే: మదురైలో ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రముఖుడి ఇంటిపై పెట్రోలు బాంబులు విసిరిన ఇద్దరిని అరెస్ట్‌ చేశారు. పోలీసుల కథనం మేరకు... మదురై అనుపాండి హౌసింగ్‌ బోర్డ్‌ ప్రాంతానికి చెందిన ఆర్‌ఎస్‌ఎస్‌ నేత కృష్ణన్‌ ఇంట్లో 24వ తేదీ దుండగులు పెట్రోలు బాంబులు విసిరి పారిపోయారు. కీళత్తురై పోలీసులు కేసు నమోదు చేసి సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా సమ్మట్టిపురానికి చెందిన హుసేన్, మేలపట్టికి చెందిన షంషుద్దీన్‌కు సంబంధం ఉన్నట్లు గుర్తించి అరెస్ట్‌ చేశామని చెప్పారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. 22వ తేదీ మదురై కోరిపాళ్యంలో జరిగిన ఎన్‌ఐఏ సోదాల సమయంలో ఇంటెలిజెన్స్‌ విభాగానికి చెందిన పోలీస్‌పై దాడి చేసిన మేలూర్‌కు చెందిన షేక్‌ అలావుద్దీన్‌ని అరెస్ట్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని