logo

పచ్చదనం అభివృద్ధి చేయాలి

తిరువళ్ళూరు జిల్లాను హరిత జిల్లాగా మార్చడానికి ప్రజలు సహకరించాలని పాడిపరిశ్రమశాఖ మంత్రి నాజర్‌ కోరారు. హరిత తమిళనాడు పథకం కింద తిరువళ్ళూరు జిల్లాలో రెండు లక్షల మొక్కలు నాటే కార్యక్రమాన్ని కడంబత్తూరు

Published : 29 Sep 2022 02:23 IST

మంత్రి నాజర్‌


మొక్క నాటి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న మంత్రి నాజర్‌

తిరువళ్ళూరు, న్యూస్‌టుడే: తిరువళ్ళూరు జిల్లాను హరిత జిల్లాగా మార్చడానికి ప్రజలు సహకరించాలని పాడిపరిశ్రమశాఖ మంత్రి నాజర్‌ కోరారు. హరిత తమిళనాడు పథకం కింద తిరువళ్ళూరు జిల్లాలో రెండు లక్షల మొక్కలు నాటే కార్యక్రమాన్ని కడంబత్తూరు యూనియన్‌ ఏగాటూరు పంచాయతీ శ్రీదేవికుప్పంలో బుధవారం నిర్వహించారు. కలెక్టర్‌ ఆల్ఫిజాన్‌వర్గీస్‌ ఆధ్వర్యంతో మంత్రి నాజర్‌ మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తిరువళ్ళూరు జిల్లాలోని 526 గ్రామ పంచాయతీల్లో 2,00,869 మొక్కలు నాటుతామన్నారు. శ్రీదేవికుప్పంలో ఉపాధి హామీ పథక కార్మికుల ద్వారా పలురకాల పండ్ల మొక్కలు నాటారని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కృష్ణస్వామి, రాజేంద్రన్‌, గోవిందరాజన్‌, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.

Read latest Tamilnadu News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని