logo

దిండిగల్లులో పటిష్ట పోలీసు భద్రత

చట్ట వ్యతిరేక కార్యకలాపాలు కొనసాగిస్తుందన్న కారణంతో పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా సంస్థపై కేంద్ర ప్రభుత్వం ఐదేళ్లపాటు నిషేధం విధించింది. ఈ సంస్థతో సంబంధం ఉన్న మరో 8 సంస్థలకు కూడా ఐదేళ్లు నిషేధం విధించింది.

Published : 29 Sep 2022 02:23 IST

విధుల్లో పోలీసులు

విల్లివాక్కం, న్యూస్‌టుడే: చట్ట వ్యతిరేక కార్యకలాపాలు కొనసాగిస్తుందన్న కారణంతో పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా సంస్థపై కేంద్ర ప్రభుత్వం ఐదేళ్లపాటు నిషేధం విధించింది. ఈ సంస్థతో సంబంధం ఉన్న మరో 8 సంస్థలకు కూడా ఐదేళ్లు నిషేధం విధించింది. ఈ క్రమంలో దిండిగల్లు కుడైప్పారైపట్టికి చెందిన భాజపా నిర్వాహకుడి వాహన గోదాముకు దుండగులు నిప్పంటించిన ఘటన జరిగిన తర్వాత ఆ ప్రాంతంలో పోలీసు భద్రతను పటిష్టం చేశారు. ఈ నేపథ్యంలో జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని అన్ని పోలీసు స్టేషన్లకు ఉన్నతాధికారుల నుంచి సర్క్యులర్లు అందాయి. ఆ మేరకు పోలీసులు సెలవు తీసుకోకుండా విధులకు హాజరుకావాలని సూచించారు. బస్టాండ్‌, రైల్వే స్టేషన్‌ తదితర ప్రాంతాలలో అదనపు భద్రతను ఏర్పాటు చేశారు. ముఖ్యమైన ప్రాంతాలతో పోలీసుల నిఘాను పకడ్బంధీగా అమలు చేయనున్నట్లు జిల్లా పోలీసు వర్గాలు బుధవారం తెలిపాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని