logo

ప్రైవేటు బస్సు ఛార్జీలు తగ్గించాలి

ప్రైవేటు బస్సుల్లో పెంచిన టిక్కెట్టు ఛార్జీలను తగ్గించాలని పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ పండుగల సీజనులో ధరలు తగ్గించి, కొత్త ధరల పట్టికను విడుదల చేయాలని కోరింది. గత వారంలో తమిళనాడు

Published : 29 Sep 2022 02:23 IST

మంత్రి శివశంకర్‌

వడపళని, న్యూస్‌టుడే: ప్రైవేటు బస్సుల్లో పెంచిన టిక్కెట్టు ఛార్జీలను తగ్గించాలని పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ పండుగల సీజనులో ధరలు తగ్గించి, కొత్త ధరల పట్టికను విడుదల చేయాలని కోరింది. గత వారంలో తమిళనాడు బస్‌ ఓనర్స్‌ అసిసియేషన్‌ (టీఎన్‌బీఓఏ) సెమీ స్లీపరు, స్లీపరు, ఏసీ బస్సుల్లో ఛార్జీలను వివరిస్తూ మొదటిసారిగా పట్టికను విడుదల చేసింది. ధరలు ఎక్కువగా ఉన్నాయని పలువురి నుంచి రవాణా శాఖకు ఫిర్యాదులందాయి. దీనిపై రాష్ట్ర రవాణాశాఖ మంత్రి ఎస్‌ఎస్‌ శివశంకర్‌ మంగళవారం ప్రైవేటు బస్సుల సంఘాలు, యాజమాన్యాలతో సమావేశమయ్యారు. ప్రజల నుంచి ఫిర్యాదులు లేకుండా ఉండేట్టు చూడాలని, తగిన విధంగా ఛార్జీల్లో మార్పు చేయాలని మంత్రి వారికి సూచించారు. ఒకటి రెండు రోజుల్లో మార్పుపై నిర్ణయం సంఘాలు బదులిచ్చాయి.

క్రమబద్ధీకరించాలి: అన్బుమణి

సైదాపేట, న్యూస్‌టుడే: ప్రైవేటు బస్సు ఛార్జీలను రాష్ట్ర ప్రభుత్వం క్రమబద్ధీకరించాలని పీఎంకే అధ్యక్షుడు అన్బుమణి రామదాస్‌ బుధవారం ఓ ప్రకటనలో డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో ప్రైవేటు బస్సు ఛార్జీలు ఆకాశన్నంటుతున్న నేపథ్యంలో నియంత్రించాలని రాష్ట్ర ప్రభుత్వం బస్సుల యజమానులను కోరిందన్నారు. ఎక్కువ ఛార్జీలు వసూలు చేసే బస్సు సంస్థలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారాన్ని ఉయోగించి ఛార్జీలు తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని