logo

‘ఏఆర్‌ రెహ్మాన్‌ పరువుకు నష్టం కలిగించలేదు’

సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహ్మాన్‌ పరువుకు నష్టం కలిగించేలా నోటీసు పంపలేదని కేంద్ర ప్రభుత్వ జీఎస్టీ కమిషనరు మద్రాసు హైకోర్టులో జవాబు పిటిషన్‌ దాఖలు చేశారు. సినిమాలకు స్వరపరిచిన పాటల కాపీరైట్‌ను

Published : 29 Sep 2022 02:23 IST

ప్యారిస్‌, న్యూస్‌టుడే: సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహ్మాన్‌ పరువుకు నష్టం కలిగించేలా నోటీసు పంపలేదని కేంద్ర ప్రభుత్వ జీఎస్టీ కమిషనరు మద్రాసు హైకోర్టులో జవాబు పిటిషన్‌ దాఖలు చేశారు. సినిమాలకు స్వరపరిచిన పాటల కాపీరైట్‌ను శాశ్వతంగా నిర్మాతలకు ఇవ్వనందుకు రూ.6.79 కోట్లు సేవా పన్ను చెల్లించాలని రెహ్మాన్‌కి 2019లో నోటీసు పంపారు. ఈ 2020 ఫిబ్రవరిలో హైకోర్టులో దీనిపై ఆయన వ్యాజ్యం వేశారు. సంగీత రచనల కాపీరైట్లను సినిమా నిర్మాతలకు శాశ్వతంగా అందించిన తరువాత వాటికి యజమానులు వారే అవుతారని తెలిపారు. పన్ను చెల్లించలేదని రూ. 6.79 కోట్ల జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. నోటీసుపై గతంలో స్టే విధించారు. బుధవారం మళ్లీ వ్యాజ్యం విచారణకు వచ్చింది. జీఎస్టీ కమిషనరు తరఫున జవాబు పిటిషన్‌ దాఖలైంది. అందులో.... పన్ను ఎగవేతకు పాల్పడినట్లు లభ్యమైన ఆధారాల ప్రకారం ఏఆర్‌ రెహ్మాన్‌కి నోటీసు పంపారని, ఆయన పేరుకు నష్టం కలిగించే ఉద్దేశం లేదని తెలిపారు. వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పుని తేదీ తెలపకుండా వాయిదా వేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని