logo

విద్యుత్తు ఉద్యోగుల నిరవధిక సమ్మె

పుదుచ్చేరిలో విద్యుత్తుశాఖ ప్రైవేటీకరణ ప్రయత్నాలకు నిరసనగా బుధవారం నిరవధిక సమ్మె ప్రారంభమైంది. అధికారులు, సిబ్బంది దశలవారీగా ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యుత్తుశాఖ వేలానికి ఆసక్తి ఉన్న సంస్థలు

Published : 29 Sep 2022 02:23 IST

ఆందోళన చేస్తున్న దృశ్యం

చెన్నై, న్యూస్‌టుడే: పుదుచ్చేరిలో విద్యుత్తుశాఖ ప్రైవేటీకరణ ప్రయత్నాలకు నిరసనగా బుధవారం నిరవధిక సమ్మె ప్రారంభమైంది. అధికారులు, సిబ్బంది దశలవారీగా ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యుత్తుశాఖ వేలానికి ఆసక్తి ఉన్న సంస్థలు దరఖాస్తు చేసుకోవచ్చంటూ మంగళవారం సాయంత్రం ప్రకటన వెలువడింది. దీనికి నిరసనగా విద్యుత్తుశాఖ ఇంజినీర్లు, ఉద్యోగుల సమాఖ్య బుధవారం ఉదయం నిరవధిక సమ్మె ప్రారంభించింది. విధులు బహిష్కరించి ఉప్పళంలోని ప్రధాన కార్యాలయం ప్రాంగణంలో ఆందోళన చేపట్టారు. రాతపూర్వకంగా ప్రభుత్వం హామీ ఇచ్చేవరకు ఇది కొనసాగుతుందని హెచ్చరించారు. పుదుచ్చేరి, కారైకాల్‌, యానాం, మాహేలలో 2 వేలకు మందికిపైగా పాల్గొన్నారు.

Read latest Tamilnadu News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని