logo

‘గృహిణులకు రూ.వెయ్యి’ పథకం త్వరలో

గృహిణులకు రూ. వెయ్యి పథకం త్వరలో ప్రారంభిస్తామని, ప్రస్తుతం దీనిపై చర్చిస్తున్నట్లు మంత్రి దురై మురుగన్‌ పేర్కొన్నారు. పొన్నై నది మధ్యలో రూ. 40 కోట్ల వ్యయంతో నిర్మించనున్న వంతెన నిర్మాణానికి బుధవారం

Published : 29 Sep 2022 02:23 IST

భూమిపూజలో పాల్గొన్న మంత్రులు దురై మురుగన్‌, ఆర్‌.గాంధీ, ఎంపీ జగద్రక్షగన్‌,ఎమ్మెల్యే నందకుమార్‌ తదితరులు

వేలూర్‌, న్యూస్‌టుడే: గృహిణులకు రూ. వెయ్యి పథకం త్వరలో ప్రారంభిస్తామని, ప్రస్తుతం దీనిపై చర్చిస్తున్నట్లు మంత్రి దురై మురుగన్‌ పేర్కొన్నారు. పొన్నై నది మధ్యలో రూ. 40 కోట్ల వ్యయంతో నిర్మించనున్న వంతెన నిర్మాణానికి బుధవారం ఆయన భూమిపూజ చేశారు. కలెక్టరు కుమరవేల్‌ పాండియన్‌ అధ్యక్షత వహించారు. మరో మంత్రి ఆర్‌. గాంధీ, అరక్కోణం ఎంపీ జగద్రక్షగన్‌, ఎమ్మెల్యే నందకుమార్‌ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా దురైమురుగన్‌ విలేకర్లతో మాట్లాడుతూ.. లోయర్‌ వంతెన స్థానంలో దీనిని నిర్మించనున్నట్లు తెలిపారు. త్వరలో కాట్పాడిలో రైల్వే వంతెన నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో కుశస్థలిపై చెక్‌ డ్యాం నిర్మించకుండా సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని