logo

వాననీటి కాలువ పనులు ముగించండి: సీఎం

నగరం, శివారు ప్రాంతాల్లో జరుగుతున్న వాననీటి కాలువ నిర్మాణ పనులను అక్టోబరులోపు ముగించాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. జలవనరుల శాఖ తరఫున సెమ్మంజేరి డీఎల్‌ఎఫ్‌ సమీపాన రూ.21.70 కోట్ల వ్యయంతో మదురపాక్కం కాలువలో షట్టర్‌తో

Published : 30 Sep 2022 02:08 IST

నూక్కంపాళెయంలో పనులను పరిశీలిస్తున్న స్టాలిన్‌

చెన్నై, న్యూస్‌టుడే: నగరం, శివారు ప్రాంతాల్లో జరుగుతున్న వాననీటి కాలువ నిర్మాణ పనులను అక్టోబరులోపు ముగించాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. జలవనరుల శాఖ తరఫున సెమ్మంజేరి డీఎల్‌ఎఫ్‌ సమీపాన రూ.21.70 కోట్ల వ్యయంతో మదురపాక్కం కాలువలో షట్టర్‌తో కూడిన హెడ్‌ రెగ్యులేటర్‌, కట్‌ అండ్‌ కవర్‌ మాక్రో డ్రయిన్‌ నిర్మాణ పనులను ముఖ్యమంత్రి స్టాలిన్‌ గురువారం పరిశీలించారు. నూక్కంపాళెయం వంతెన సమీపాన అరసన్‌కళని కాలువ నుంచి పొలిని క్వార్టర్లు, తమిళనాడు అర్బన్‌ హాబిటాట్‌ డెవలప్‌మెంట్‌ క్వార్టర్లు, సెమ్మంజేరి కాలువ రెండు వైపులు నూక్కంపాళెయం వంతెన వరకు రిటైనింగ్‌ వాల్‌, పూడికతీత తదితర మొత్తం రూ.174.48 కోట్ల వ్యయంతో జరుగుతున్న పనులను పరిశీలించారు. అక్టోబరులోపు ముగించాలని అధికారులకు సూచించారు. వెంట మంత్రులు దురైమురుగన్‌, కేఎన్‌ నెహ్రూ, ఉన్నత విద్యాశాఖ మంత్రి పొన్ముడి, అన్బరసన్‌, సుబ్రమణియన్‌, ఎంపీ తమిళచ్చి తంగపాండియన్‌, గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ కమిషనరు గగన్‌దీప్‌ సింగ్‌ బేడి, మానిటరింగ్‌ అధికారి వీరరాఘవరావు తదితరులు ఉన్నారు.

Read latest Tamilnadu News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts