logo

కొత్త ఆవిష్కరణలపై దృష్టి ముఖ్యం

వీఐటీలో గ్రావిటాస్‌-2022 ఇంటెలెక్చువల్‌ టెక్నాలజీ ఫెస్టివల్‌ను శుక్రవారం నిర్వహించారు. కులపతి జి.విశ్వనాథన్‌ అధ్యక్షత వహించారు. ప్రత్యేక అతిథిగా రక్షణ శాఖ మంత్రి సాంకేతిక సలహాదారు సతీష్‌ రెడ్డి మాట్లాడుతూ..

Published : 01 Oct 2022 01:04 IST


చిన్న విమానాన్ని ప్రదర్శిస్తున్న దృశ్యం

వేలూర్‌, న్యూస్‌టుడే: వీఐటీలో గ్రావిటాస్‌-2022 ఇంటెలెక్చువల్‌ టెక్నాలజీ ఫెస్టివల్‌ను శుక్రవారం నిర్వహించారు. కులపతి జి.విశ్వనాథన్‌ అధ్యక్షత వహించారు. ప్రత్యేక అతిథిగా రక్షణ శాఖ మంత్రి సాంకేతిక సలహాదారు సతీష్‌ రెడ్డి మాట్లాడుతూ.. ఇలాంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థుల నైపుణ్యాలను వెలికి తీయవచ్చన్నారు. 15 ఏళ్ల క్రితం ఒక్కో రాష్ట్రంలో 5 లేదా 6 ఇంజినీరింగు కళాశాలలు మాత్రమే ఉండేవని, ఇప్పుడు ఏటా 14 లక్షల మంది ఇంజినీర్లు బయటకు వస్తున్నారని తెలిపారు. తాము అంతరిక్ష పరిశోధనలకు అవసరమైన పరికరాలను కూడా తయారు చేస్తామని, సైబర్‌ క్రైంను గుర్తించే పరికరాలు కూడా భారత్‌లో తయారవుతున్నాని తెలిపారు. యువ ఇంజనీర్ల పాత్ర కీలకమని చెప్పారు. ప్రస్తుత సాంకేతికతతో వినూత్న ఆవిష్కరణలు చేయాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వీఐటీ ఉపకులపతి శంకర్‌ విశ్వనాథన్‌, అసిస్టెంటు ఛాన్సలరు కాదంబరి విశ్వనాథన్‌  తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని