logo

ఆలయాల్లో ఉత్సవ శోభ

ఉమ్మడి కాంచీపురం జిల్లాలోని ఆలయాల్లో నవరాత్రి ఉత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. కామాక్షి అమ్మవారు, రేణుకాపరమేశ్వరి, అంకాళపరమేశ్వరి, కరుక్కనిల్‌ అమరందవళ్‌, దండుమారియ్మన్‌ ఆలయం తదితర ఆలయాల్లో అమ్మవార్లను రోజుకో అవతారంలో అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తున్నారు.

Published : 03 Oct 2022 00:36 IST

తిరువళ్ళూరు: నాగభూషిణిగా వేంబులి అమ్మ

కాంచీపురం, న్యూస్‌టుడే: ఉమ్మడి కాంచీపురం జిల్లాలోని ఆలయాల్లో నవరాత్రి ఉత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. కామాక్షి అమ్మవారు, రేణుకాపరమేశ్వరి, అంకాళపరమేశ్వరి, కరుక్కనిల్‌ అమరందవళ్‌, దండుమారియ్మన్‌ ఆలయం తదితర ఆలయాల్లో అమ్మవార్లను రోజుకో అవతారంలో అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తున్నారు. పిళ్లయార్‌పాళ్యంలోని ఆనంద వినాయకర్‌ ఆలయంలో ఉత్సవాలలో 6వ రోజు లక్ష్మీ నారాయణుడి వేషంలో అమ్మవారిని అలంకరించారు. శ్రీపెరంబుదూర్‌ ఎతిరాజ ఆలయంలో నాదవళ్లి అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి శనివారం రాత్రి గజ వాహనంపై ఊరేగించారు. కాంచీపురం- వందవాసి మార్గంలోని కూళమందల్‌ గ్రామంలోని పేసుం పెరుమాల్‌ ఆలయంలో స్వామివారిని గధాయుధంతో అలంకరించి గ్రామంలో ఊరేగించారు. కాంచీపురం పడమర రాజ వీధిలో ఉన్న ఆర్య వైశ్య సమాజంలో 6వ రోజు కన్యకా పరమేశ్వరి అమ్మవారిని చండి అవతారంలో అలంకరించారు. చెంగల్పట్టు జిల్లాలోని అనేక ఆలయాల్లో నవరాత్రి ఉత్సవాలను ఘనంగా జరుపుతున్నారు.

తిరుత్తణి, న్యూస్‌టుడే: తిరుత్తణి మురుగన్‌ ఆలయంలో భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో ప్రత్యేక దర్శనాన్ని అధికారులు రద్దు చేశారు. దసరా పండగను పురస్కరించుకుని రాష్ట్రం నలుమూలలు, ఇతర రాష్ట్రాల నుంచి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో చేరుకున్నారు. ఆదివారం ఉదయం భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. ప్రత్యేక దర్శనాల మార్గాలు మూసేయడంతో స్వామివారి దర్శనానికి రెండు గంటల సమయం పట్టింది. ఆలయ ఉప కమిషనర్‌ విజయ మాట్లాడుతూ.. దేవాదాయశాఖ కమిషనర్‌ ఉత్తర్వులతో రూ.25, రూ.150 ప్రత్యేక దర్శన మార్గాలను మూసేశామని తెలిపారు. తదుపరి ఉత్తర్వులు అందిన తర్వాతే ప్రత్యేక దర్శనానికి అనుమతిస్తామని వెల్లడించారు.

తిరుత్తణి: వల్లి, దేవయాని సమేత ఆర్ముగస్వామికి హారతిస్తున్న దృశ్యం

* వేలచ్చేరి, న్యూస్‌టుడే: రామేశ్వరం రామనాథస్వామి ఆలయ ఉప ఆలయమైన ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో శనివారం రాత్రి 1008 దీపాల పూజను నిర్వహించారు. ఈ పూజలో అధిక సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొన్నారు.

* పళ్లిపట్టు, న్యూస్‌టుడే: పళ్లిపట్టు బజారువీధిలోని శ్రీకన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 7వ రోజైన ఆదివారం అమ్మవారు సరస్వతి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. పళ్లిపట్టు తాలూకా నొచ్చిలి గ్రామంలోని ఎల్లమ్మ ఆలయంలో అమ్మవారు మహాలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. మూలమూర్తికి బంగారు కవచంతో ప్రత్యేక అలంకరణ చేశారు.

* తిరువళ్ళూరు, న్యూస్‌టుడే: తిరువళ్ళూరులో వేంబులిఅమ్మ, గోలకొండమ్మ, పొన్నియమ్మ ఆలయాలలో నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా 6వ రోజు ఆదివారం సాయంత్రం వేంబులి అమ్మవారిని నాగభూషిణి అలంకరణ, గోలకొండమ్మ వారిని నీరజాదేవి అలంకరణ, పొన్నియమ్మవారిని ఆదిపరాశక్తిగా అలంకరించి నవరాత్రి మండపంలో కొలువుదీర్చి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి.

వెళ్లీశ్వర ఆలయంలో కామాక్షిగా అమ్మవారు  - చెన్నై, న్యూస్‌టుడే

వేడుకగా నవ కన్యపూజ

చెన్నై(సాంస్కృతికం), న్యూస్‌టుడే: అడయారు ఆర్యవైశ్య అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నవరాత్రుల సందర్భంగా ఆదివారం ఉదయం నిర్వహించిన నవకన్య పూజ వేడుకగా జరిగింది. నవకన్య పేరిట 12 మంది చిన్నారులకు పసుపు, కుంకుమ, నూతన వస్త్రాలు, అలంకరణ వస్తువులు బహూకరించారు. సుమంగళులు పూలదండలు వేసి హారతులు ఇచ్చారు. అధ్యక్షులు డాక్టర్‌ కె.బాలగురునాథన్‌, ప్రధాన కార్యదర్శి టీజీ శ్రీనివాసన్‌, కార్యదర్శి ఎ.సుధాకర్‌ తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

చెన్నై(సాంస్కృతికం): కన్య పూజలో పాల్గొన్న చిన్నారులు

రమణీయం రథోత్సవం

చెన్నై (సాంస్కృతికం), న్యూస్‌టుడే: జార్జిటౌన్‌లోని శ్రీకన్యకాపరమేశ్వరి దేవస్థానంలో ఆదివారం రాత్రి ఏర్పాటైన రథోత్సవం రమణీయంగా సాగింది. ఉదయం వేద పారాయణం, రుద్రాభిషేకం, మూలమంత్ర హోమం ఆగమోక్తంగా నిర్వహించారు. రాత్రి మూలవర్లను పలు రకాల పుష్పాలతో బంగారు ఆభరణాలతో కనువిందుగా అలంకరించారు. ఉత్సవమూర్తిని రథంపై కొలువుదీర్చి భక్తులకు దర్శనభాగ్యం కలిగించారు.  బాలాజీ భజన మండలి, గానప్రియ బృందం, ఊరా ఆంజనేయులు బృందం ఆలపించిన భక్తిగేయాలు, మంజుశ్రీ భరతనాట్యం భక్తిభావాన్ని పెంచాయి. కళాకారులను నిర్వాహకులు సత్కరించారు.

కాంచీపురం: గజ వాహనంపై నాథవళ్లి తాయారు

 

Read latest Tamilnadu News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని