logo

ప్రభుత్వ చర్యలకు అందరూ కట్టుబడి ఉండాలి

శాంతిభద్రతల విషయంలో ప్రభుత్వ చర్యలకు అందరూ కట్టుబడి ఉండాలని డీఎండీకే కోశాధికారి ప్రేమలత తెలిపారు. చెన్నై నుంచి విమానం ద్వారా మదురై  విమానాశ్రయానికి ఆదివారం చేరుకున్న ఆమె విలేకరులతో మాట్లాడుతూ...

Published : 03 Oct 2022 00:36 IST

డీఎండీకే కోశాధికారి ప్రేమలత

ఆర్కేనగర్‌, న్యూస్‌టుడే: శాంతిభద్రతల విషయంలో ప్రభుత్వ చర్యలకు అందరూ కట్టుబడి ఉండాలని డీఎండీకే కోశాధికారి ప్రేమలత తెలిపారు. చెన్నై నుంచి విమానం ద్వారా మదురై  విమానాశ్రయానికి ఆదివారం చేరుకున్న ఆమె విలేకరులతో మాట్లాడుతూ....ఆమ్ని బస్సు ఛార్జీల పెంపు అనేది వ్యాపారమే అన్నారు. ఆ బస్సు యజమానులకు లాభం వచ్చేలా ప్రభుత్వం సాయపడుతోందన్నారు. ఆమ్ని బస్సులకు పండుగ రోజులలో మంచి ఆదాయం వస్తుందన్నారు. మిగిలిన సమయాల్లో సాధారణ ఛార్జీలే ఉండగా, పండుగ దినాలలో మాత్రం ఎందుకు పెంచాలని ప్రశ్నించారు. అన్ని వ్యాపారాలుగానే సాగుతున్నాయని ఆరోపించారు. ప్రభుత్వం వ్యాపార కోణంలోనే నడుచుకుంటోందన్నారు. ప్రజల కోసం ఉన్న ప్రభుత్వం కాదన్నారు. సర్కారు బస్సులను మెరుగుపరిస్తే అందరూ వాటిల్లోనే ప్రయాణిస్తారన్నారు. రాష్ట్రంలో అధికంగా పెట్రోల్‌ బాంబ్‌ విసిరే ఘటనలు చోటుచేసుకుంటున్నాయని చెప్పారు. నిందితులపై జాతీయ భద్రతా చట్టం కింద చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఉచితంగా ప్రయాణం వద్దని అందరూ చెప్పాలన్నారు. ప్రజల పన్నుతోనే ప్రభుత్వ బస్సు నడుపుతున్నారని చెప్పారు. మదురై ఎయిమ్స్‌ ఆస్పత్రిపై ఇటుకతో డీఎంకే ఎమ్మెల్యే ఉదయనిధి రాజకీయం చేశారన్నారు. చెప్పినట్లు త్వరగా ఎయిమ్స్‌ నిర్మాణం పూర్తి చేయాలని కోరుతున్నామని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని