logo

ధూమపాన నిషేధ చట్టం అమలు చేయాలి

బహిరంగ ప్రదేశాల్లో ధూమపాన నిషేధానికి చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని పీఎంకే అధ్యక్షుడు అన్బుమణి రామదాసు డిమాండు చేశారు. ఆదివారం ఆయన విడుదల చేసిన ప్రకటనలో..

Published : 03 Oct 2022 00:36 IST

అన్బుమణి

సైదాపేట, న్యూస్‌టుడే: బహిరంగ ప్రదేశాల్లో ధూమపాన నిషేధానికి చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని పీఎంకే అధ్యక్షుడు అన్బుమణి రామదాసు డిమాండు చేశారు. ఆదివారం ఆయన విడుదల చేసిన ప్రకటనలో.. 14 ఏళ్ల క్రితం గాంధీ జయంతి రోజున తాను కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్నప్పుడు అనేక రాజకీయ, చట్ట పోరాటాల తర్వాత ఈ చట్టాన్ని ప్రవేశపెట్టానని తెలిపారు. ఈ చట్టం ఇప్పటికీ ఉన్నా సక్రమంగా అమలు చేయడంలేదని పేర్కొన్నారు. మనదేశంలో ఏడాదికి 70 లక్షల మంది పొగ తాగడం వలన మృతి చెందుతున్నారని చెప్పారు. పొగ పీల్చడం వల్ల 12 లక్షల మంది మరణిస్తున్నారని తెలిపారు. దీన్ని అడ్డుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బహిరంగ ప్రదేశాల్లో ధూమపాన నిషేధ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు